‘కాంచన 3’ మూవీ తెలుగు రివ్యూ... మరోసారి వారినే టార్గెట్ చేసిన రాఘవ లారెన్స్...

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో థ్రిల్ చేసిన థమన్... మరోసారి పాత బాటలోనే నడిచిన రాఘవ లారెన్స్... మాస్ ఆడియోన్స్‌ను టార్గెట్ చేసుకుంటూ ‘కాంచన’ సీక్వెల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 19, 2019, 6:39 PM IST
‘కాంచన 3’ మూవీ తెలుగు రివ్యూ... మరోసారి వారినే టార్గెట్ చేసిన రాఘవ లారెన్స్...
కాంచన 3 మూవీ రివ్యూ... మరోసారి వారినే టార్గెట్ చేసిన లారెన్స్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 19, 2019, 6:39 PM IST
రాఘవ లారెన్స్... కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా మారాడు. ‘మాస్’, ‘స్టైల్’, ‘డాన్’, ‘రెబల్’ వంటి సినిమాలతో కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే ‘రెబల్’ సినిమా తర్వాత తెలుగు సినిమాలను పక్కన బెట్టి, కేవలం కోలీవుడ్‌పైనే దృష్టి పెట్టిన రాఘవ లారెన్స్... అక్కడ మంచి హిట్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా హార్రర్ కామెడీ నేపథ్యంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’ సినిమాలు అక్కడా, ఇక్కడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అదే సీక్వెల్‌లో వచ్చిన నాలుగో చిత్రం ‘కాంచన 3’. రాఘవేంద్ర ప్రొడక్షన్స, లైట్ హైస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘కాంచన 3’ సినిమా ఏప్రిల్ 19న విడుదల అయ్యింది. తమిళ ‘బిగ్‌బాస్’ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఓవియా, వేదిక, నిక్కీ తంబోలీ, కోవై సరళ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

kanchana 3 review, kanchana 3 movie review in telugu, Raghava Lawrence's Kanchana 3, Oviya Bigg boss, vedhika kanchana, kovai sarala kanchana 3, kanchana movie sequel, raghava lawrence movies list, telugu movie, రాఘవ లారెన్స్, కాంచన 3, కాంచన 3 మూవీ రివ్యూ, కాంచన 3 రాఘవ లారెన్స్, రాఘవ లారెన్స్ సినిమాలు, లారెన్స్ డ్యాన్స్, రాఘవ లారెన్స్ వేదిక, వేదిక హీరోయిన్, ఓవియా బిగ్‌బాస్, కోవై సరళ
‘కాంచన 3’ సీక్వెల్ దాదాపు రూ.40 కోట్ల భారీ వ్యయంతో రూపొందింది.


ఇంతకీ కథేంటంటే...

కొందరు పోలీసులను చంపిన రౌడీ భవానిని కాళి పథకం ప్రకారం చంపేస్తాడు. అదే సమయంలో తన కూతురికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి ఓ మంత్రగాడు, మహిళను చెట్టుకు కట్టేస్తాడు. ఆ దారుణాన్ని చూసిన రాఘవ లారెన్స్ కుటుంబం, ఆమెను కాపాడతారు. అక్కడి నుంచి వారికి కష్టాలు ఎదురవుతాయి. ఓ దెయ్యం రాఘవ లారెన్స్ కుటుంబం వెంట వచ్చి, వారిని భయపెడుతూ ఇబ్బందులు పెడుతుంటుంది. ఆ దెయ్యం ఎవరు? ఎలా వచ్చింది? కాళి కథ ఏంటి? ఇదే చిత్ర కథ. ‘ముని’ సినిమా నుంచి రాఘవలారెన్స్... ఫాలో అవుతున్న స్క్రీన్ ప్లే దీనికి కూడా ఉపయోగించాడు. భయపడే కొడుకు రాఘవ, అతని తల్లి కోవై సరళ, వదిన దేవదర్శిని, మరదళ్లు... ఇందులో ఏ మార్పు చేయలేదు. చివరికి క్లైమాక్స్‌లో దేవుడి సాయంతో చెడును అంతమొందించడంతో పాటు చివర్లో నెక్ట్స్ సీక్వెల్ గురించి కూడా యథావిధిగా ప్రకటించాడు రాఘవ లారెన్స్.kanchana 3 review, kanchana 3 movie review in telugu, Raghava Lawrence's Kanchana 3, Oviya Bigg boss, vedhika kanchana, kovai sarala kanchana 3, kanchana movie sequel, raghava lawrence movies list, telugu movie, రాఘవ లారెన్స్, కాంచన 3, కాంచన 3 మూవీ రివ్యూ, కాంచన 3 రాఘవ లారెన్స్, రాఘవ లారెన్స్ సినిమాలు, లారెన్స్ డ్యాన్స్, రాఘవ లారెన్స్ వేదిక, వేదిక హీరోయిన్, ఓవియా బిగ్‌బాస్, కోవై సరళ
తమిళ ‘బిగ్‌బాస్’ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఓవియా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది.


ఎలా ఉందంటే...
‘కాంచన 3’ సినిమా చూస్తున్నంతసేపు ‘కాంచన’ సినిమాను మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రెండు ఆత్మలున్న వ్యక్తిగా రాఘవ లారెన్స్ తన యాక్టింగ్ స్కిల్స్ మొత్తం చూపించాడు. ‘కాంచన 3’ సినిమాకు అదనపు ప్లస్ పాయింట్ థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ‘భాగమతి’ సినిమాను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ప్రాణం పోసిన థమన్... మరోసారి అందులో తన ప్రావీణ్యాన్ని చూపించాడు. ఓ పక్క హర్రర్ ఉంటూనే కామెడీ పండించాడు రాఘవ లారెన్స్. ‘కాంచన’ సినిమాలో రాయ్ లక్ష్మీతో గ్లామర్ పలికించి, రొమాన్స్ చేసిన రాఘవ లారెన్స్ ఈ సారి ఓవియా, వేదిక, నిక్కీ తంబోలీలతో ఆడి పాడాడు. రాఘవ లారెన్స్ తన సినిమాల్లో పాటలు వినసొంపుగా ఉండేలా జాగ్రత్త పడతాడు. అయితే ఈ సారి తమిళ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటల్లో తమిళ వాసన వినిపిస్తుంది. మాస్ ఆడియోన్స్ టార్గెట్ చేస్తూ తీసిన సినిమా... వారికి బాగానే కనెక్ట్ అవుతుంది. అన్నీ పాతవే అయినా నవ్విస్తూ, భయపెట్టడంలో రాఘవ లారెన్స్ మరోసారి సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఇంతకుముందు సీక్వెల్ సినిమాలు చూడని వారు ‘కాంచన 3’ని బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ‘కాంచన 3’ అంతగా నచ్చకపోవచ్చు.

సింగిల్ లైన్: కాంచన 3... రంగు, రుచి, వాసన... అన్నీ పాతవే
న్యూస్ 18 తెలుగు రేటింగ్: 2.75/5
First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...