Rajinikanth Lawrence: రజినీకాంత్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ రాఘవ..

Super Star Rajinikanth Raghava Lawrence: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు లారెన్స్ రాఘవ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 15, 2020, 9:09 AM IST
Rajinikanth Lawrence: రజినీకాంత్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ రాఘవ..
రజినీకాంత్‌తో రాఘవ లారెన్స్ (File/Photo)
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు లారెన్స్ రాఘవ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. రజినీకాంత్ త్వరలో అరంగేట్రం చేయబోతన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. వచ్చే యేడాది తమిళనాడు ఎన్నికలున్న నేపథ్యంలో ఈ యేడాది తన పుట్టినరోజు డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ తన పార్టీ పేరును ప్రకటించడంతో పాటు విధి విధాలను ప్రకటించనున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు లారెన్స్ రాఘవ మాట్లాడుతూ.. రజినీకాంత్ పార్టీ పెడితే.. అందులో చేరే మొదటి వ్యక్తి నేనే అవుతానని చెబుతున్నాడు. లారెన్స్   ఈ ప్రకటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐతే.. రజినీకాంత్ పార్టీతో చేరడానికి లారెన్స్ ఓ షరుతు విధించాడు.

రజినీకాంత్‌తో రాఘవ లారెన్స్ (File/Photo)


అది ఏమిటంటే.. రజినీకాంత్.. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో తన పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్ధి అయితేనే తాను ఆ పార్టీలో చేరతానని చెప్పాడు. వేరే వ్యక్తి అయితే.. తాను అందుకు అంగీకరించబోనని లారెన్స్ కుండబద్దలు కొట్టాడు. గతంలో రాజకీయాల్లో వస్తున్నానని చెప్పినా రజినీకాంత్.. ముఖ్యమంత్రిగా మాత్రం తాను ఉండనని చెప్పిన విషయం తెలిసిందే కదా. అయితే.. రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లారెన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం రజినీకాంత్.. శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. లారెన్స్ దర్శకత్వం వహించిన అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమా త్వరలో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 15, 2020, 9:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading