తెలుగులో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా లారెన్స్ రాఘవ దర్శకత్వంలో ‘కాంచన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీ బాంబ్’ ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత రాఘవకు తెలియకుండా ‘లక్ష్మీ బాంబ్’ అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అలా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో రాఘవ లారెన్స్ హార్ట్ అయ్యాడు. అంతేకాదు నాకు గౌరవం లేని చోట ఈ సినిమా చేయనని చెప్పేసాడు. ఐతే ఈ రీమేక్‌ను లారెన్స్ రాఘవనే డైరెక్ట్ చేయాలంటూ..ఆయన ఫ్యాన్స్ తో పాటు ‘లక్ష్మీ బాంబ్’ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ అభిమానులు లారెన్స్‌కు రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెట్టారు. అంతేకాదు ఈ విషయమై డైరెక్ట్‌గా అక్షయ రంగంలోకి లారెన్స్‌ను బుజ్జగించడంతో తిరిగి ‘లక్ష్మీ బాంబ్’ రీమేక్‌ను డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిక వెల్లడించాడు. నా ఫీలింగ్స్‌ను అర్ధం చేసుకొని సమస్యను పరిష్కరించిన అక్షయ్ కుమార్‌కు ధాంక్స్ చెప్పాడు.
Hi Dear Friends and Fans...!
As you wished I would like to let you know that I am back on board as a director of #LaxmmiBomb with @akshaykumar pic.twitter.com/9HRHF5y2VV
— Raghava Lawrence (@offl_Lawrence) June 1, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood, Hindi Cinema, Kiara advani, Raghava Lawrence