• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAGHAVA LAWRENCE GENEROUS HELP OF 5 LAKH 75 THOUSAND RUPEES TO FILM DANCERS TA

పేద, నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ ఆర్ధిక సాయం..

పేద, నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ ఆర్ధిక సాయం..

రాఘవ లారెన్స్ (Twitter/Lawrence)

Raghava Lawrence | రాఘవ లారెన్స్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్ధిక సహాయాన్ని అందించారు హీరో కమ్ డైరెక్టర్ కమ్ ఈ డాన్స్ డైరెక్టర్ లారెన్స్ రాఘవ. 

  • Share this:
    రాఘవ లారెన్స్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్ధిక సహాయాన్ని అందించారు హీరో కమ్ డైరెక్టర్ కమ్ ఈ డాన్స్ డైరెక్టర్ లారెన్స్ రాఘవ. ఒక్కొక్కరికీ రూ. 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి ఈ సాయం అందిచారు. మరోవైపు చెన్నైలో 13 మందికి మొత్తం 23 మందికి రూ. 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యత గా భావించి వారి అకౌంట్ల కు డైరెక్ట్ గా డబ్బు పంపించడం జరిగిందన్నారు. తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు.

    Raghava Lawrence Generous Help Of 5 lakh 75 thousand rupees to Film Dancers,raghava lawrence,rRaghava Lawrence Generous Help Of 5 lakh 75 thousand,aghava lawrence twitter,raghava lawrence donation,raghava lawrence 3 crore donation corona,raghava lawrence dance,raghava lawrence movies,kanchana 3,lawrence,raghava lawrence dance performance,raghava lawrence songs,raghava lawrence (film director),raghava lawrence kanchana movie,raghava lawrence tamil movies,raghava lawrence new movie,raghava lawrence (film writer),akshay kumar donates rs 1.5 crore,రాఘవ లారెన్స్,రాఘవ లారెన్స్ 3 కోట్ల విరాళం,పేద నృత్య కళాకారులకు సాయం ప్రకటించిన లారెన్స్
    రాఘవ లారెన్స్ Photo : twitter


    ఇప్ఫటికే కరోనాపై పోరాటంలో త‌న వంతు సాయంగా ఏకంగా రూ. 3 కోట్లు విరాళం అందజేసినసంగతి తెలిసిందే కదా.  అందులో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లు.. ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లు.. డాన్సర్స్ అసోషియేషన్‌కు రూ. 50 లక్షలు.. రూ. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు రూ.  25 లక్షలు..రూ. 75 ల‌క్ష‌లు తన సొంతూరి వాళ్ళకు ఇచ్చాడు లారెన్స్. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న సినిమా కోసం తీసుకున్న 3 కోట్ల అడ్వాన్స్‌ ఒక్క రూపాయి కూడా తన ఖాతాలో వేసుకోకుండా క‌రోనాపై చేస్తున్న పోరాటానికి విరాళంగా ఇచ్చేసాడు లారెన్స్. ప్రస్తుతం లారెన్స్.. అక్షయ్ కుమార్ హీరోగా ‘లక్ష్మీ బాంబ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమా లారెన్స్ హీరోగా నటించిన ‘కాంచన’ సినిమాకు రీమేక్.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: