• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAGHAVA LAWRENCE BROTHER VINOD HARASSED ME SAYS JUNIOR ARTIST DIVYA SR

డాన్స్ మాస్టర్ లారెన్స్ తమ్ముడు వేధిస్తున్నాడు: వరంగల్ యువతి..

డాన్స్ మాస్టర్ లారెన్స్ తమ్ముడు వేధిస్తున్నాడు: వరంగల్ యువతి..

సోదరుడితో లారెన్స్, దివ్య Photo : Youtube (ABN)

ప్రముఖ డాన్స్ మాస్టర్, దర్శకుడు రాఘవ లారెన్స్ సోదరుడు వినోద్ తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని ఆరోపిస్తోంది దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్.

  • Share this:
    ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ సోదరుడు వినోద్ తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని ఆరోపిస్తోంది దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన దివ్య మాట్లాడుతూ.. లారెన్స్ సోదరుడు వినోద్‌ ప్రేమను తాను రిజెక్ట్ చేయడంతో వేధించడం మొదలు పెట్టాడని పేర్కోంది. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడిన దివ్య.. ఇన్ని రోజులు ఓపిక పట్టానని వినోద్ వేధింపులు మితిమీరిపోవడంతో  తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అయితే అక్కడి సీఐతో కుమ్మక్కై వాళ్లు.. రివర్స్‌గా తనపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ఆ పోలీస్ అధికారి లారెన్స్‌ ఎలా చెబితే అలానే.. అంటూ ఆయనకు నమ్మిన బంటులా మారిపోయారని తెలిపింది. ఆ పోలీసు అధికారి అండతో తనను జైలుకు కూడా పంపించారని దివ్య ఆరోపించింది. అంతేకాదు కొన్ని రోజులుగా తనను కొందరు ఫాలో అవుతున్నారని, లారెన్స్ తమ్ముడితో ప్రాణ భయం ఉందని దివ్య పేర్కోంది.  ఈ సందర్భంగా లారెన్స్ సోదరుడి నుండి తనను కాపాడాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేడుకుంటున్నానని  పేర్కోంది. లారెన్స్ ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్నాడు. లక్ష్మి బాంబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    Published by:Suresh Rachamalla
    First published: