• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAGHAVA LAWRENCE BROTHER VINOD CASE GET COMPLICATED TELANGANA SC ST COMMISSION TAKE UP THIS CASE TA

రాఘవ లారెన్స్ సోదరుడు వినోద్ పై బిగుస్తున్న ఉచ్చు.. తాజాగా అట్రాసిటీ కేసు నమోదు...

రాఘవ లారెన్స్ సోదరుడు వినోద్ పై బిగుస్తున్న ఉచ్చు.. తాజాగా అట్రాసిటీ కేసు నమోదు...

సోదరుడితో లారెన్స్, దివ్య Photo : Youtube (ABN)

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ సోదరుడు వినోద్ తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని ఆరోపిస్తోంది దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్. తాజాగా ఆమె తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్‌లో లారెన్స్ సోదరుడు వినోద్ పై ఫిర్యాదు చేసింది.

  • Share this:
    ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ సోదరుడు వినోద్ తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని ఆరోపిస్తోంది దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన దివ్య మాట్లాడుతూ.. లారెన్స్ సోదరుడు వినోద్‌ ప్రేమను తాను రిజెక్ట్ చేయడంతో వేధించడం మొదలు పెట్టాడని పేర్కోంది. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడిన దివ్య.. ఇన్ని రోజులు ఓపిక పట్టానని వినోద్ వేధింపులు మితిమీరిపోవడంతో  తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అయితే అక్కడి సీఐతో కుమ్మక్కై వాళ్లు.. రివర్స్‌గా తనపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ఆ పోలీస్ అధికారి లారెన్స్‌ ఎలా చెబితే అలానే.. అంటూ ఆయనకు నమ్మిన బంటులా మారిపోయారని తెలిపింది. ఆ పోలీసు అధికారి అండతో తనను జైలుకు కూడా పంపించారని దివ్య ఆరోపించింది. అంతేకాదు కొన్ని రోజులుగా తనను కొందరు ఫాలో అవుతున్నారని, లారెన్స్ తమ్ముడితో ప్రాణ భయం ఉందని దివ్య పేర్కోంది. తాజాగా ఈ విషయమై ఆమె తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్‌‌‌లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వినోద్ తనను శారీరకంగా మానసికంగా వేధించడంతో పాటు కులంతో దూషించడాని తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దోషులు ఎంత పెద్ద వారైనా వాళ్లను ఒదిలే ప్రసక్తే లేదంటున్నారు. అంతేకాదు దళితులకు అణగారిన వర్గాలకు కమిషన్ ఎల్లవేళల అండగా ఉంటుందున్నారు.  లారెన్స్ ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్నాడు. లక్ష్మి బాంబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: