Home /News /movies /

RAGHAVA LARENCE KANCHANA 3 ACTRESS RI DJAVI ALEXANDRA SUICIDE IN GOA ISSUE GOES VIRAL NR

Kanchana 3 - Ri Djavi Alexandra: అనుమానాస్పద స్థితిలో కాంచన 3 నటి మృతి.. గోవా హోటల్ రూమ్‌లో?

Kanchana 3 - Ri Djavi Alexandra

Kanchana 3 - Ri Djavi Alexandra

Kanchana 3 - Ri Djavi Alexandra: 2019లో మంచి సక్సెస్ అందుకున్న హారర్ మూవీ కాంచన 3. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కీలక పాత్రలో నటించగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

    Kanchana 3 - Ri Djavi Alexandra: 2019లో మంచి సక్సెస్ అందుకున్న హారర్ మూవీ కాంచన 3. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కీలక పాత్రలో నటించగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో మరో హీరోయిన్ దయ్యం పాత్రలో రష్యన్ కి చెందిన అలెగ్జాండ్రా జావి అనే నటి నటించగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ నటి మృతి చెందిందని బ్రేకింగ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి.

    తాజాగా సోషల్ మీడియాలో అలెగ్జాండర్ జావి మరణించిందని వార్తలు వినిపించే సరికి అందరూ ఒకేసారి షాకయ్యారు. ఇంత సడన్ గా ఆమెకు ఏమయ్యింది అని అసలు ఎలా చనిపోయింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు. ఆమె గోవాలో తాను బస చేసిన హోటల్లో మృతి చెందగా.. ఈమె మరణం వెనుక ఓ కారణం ఉందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

    అందులో కొన్ని రోజుల క్రితం తను ప్రేమించిన వ్యక్తితో కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోయిందని తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది అన్నట్లు తన సన్నిహితులు తెలిపారు. దాంతో పోలీసులు ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తూ తన ప్రియుడు తనను కాదన్నందుకు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లి తట్టుకోలేక పోవడం తో తానే గోవా హోటల్ లో ఆత్మహత్య చేసుకుందేమో అని అంటున్నారు.

    అంతే కాకుండా ఈమె మరణం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయేమో అని పోలీసులు ఈ కేసును బాగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈమె పై ఓ ఫోటోగ్రాఫర్ లైంగిక వేధింపులు చేయడంతో అదే సమయంలో ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులకు అనుమానాలు ఎక్కువగా రావడంతో అతడిని విచారణ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Kollywood, Raghava larence, Ri djavi alexandra, Russia actress, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు