శ్రీలంక బాంబు దాడి నుంచి తప్పించుకున్న హీరోయిన్ రాధిక శరత్ కుమార్

శ్రీలంకలో ఉగ్రవాదులు బాంబుల వర్షం కురిపించారు. సుమారు 160 మంది ఘటనలో ప్రాణాలు కొల్పోగా.. 300మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఈ ఘటన నుంచి తప్పించుకున్నారు ప్రముఖ హీరోయిన్ రాధిక శరత్ కుమార్.

news18-telugu
Updated: April 21, 2019, 2:23 PM IST
శ్రీలంక బాంబు దాడి నుంచి తప్పించుకున్న హీరోయిన్ రాధిక శరత్ కుమార్
రాధిక శరత్ కుమార్
news18-telugu
Updated: April 21, 2019, 2:23 PM IST
సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ బాంబు దాడుల తప్పించుకున్నారు. కొలంబోలో మూడు చర్చిలు, మూడు హోటల్లలో ఐసీస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా బాంబులు పేల్చారు. ఘటనలో దాదాపు 160 మంది ప్రాణాలు విడిచారు. అయితే, ఘటనకు కొన్ని గంటల ముందే హీరోయిన్ రాధిక ఉగ్రవాదులు పేల్చిన హోటల్ నుంచి బయటికొచ్చారు. ఇదే విషయాన్ని రాధిక ట్వీట్ చేశారు. జరిగిన ఘటనను తాను న్యూస్ ద్వారా తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని తెలిపారు. ఇది చాలా బాధాకరమైన విషయమని రాధిక చెప్పారు.

కొలంబోలో బాంబు దాడి జరిగిన చర్చికి తాను రెగ్యులర్‌గా వెళ్తానని అయితే, అనుకోకుండా చర్చికి వెళ్లకుండానే వెనుతిరిగినట్లు ఆమె తెలిపారు. అదే విధంగా సినమన్ గ్రాండ్ హోటల్‌లోనే తాను స్టే చేసినట్లు.. ఘటనకు కొన్ని గంటల ముందే తాను అక్కడ్నుంచి వచ్చినట్లు ట్వీట్ చేశారు.
First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...