హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi : చిరంజీవితో మరోసారి నటించనున్న ఒకప్పటి టాప్ హీరోయిన్.. ట్వీట్ వైరల్..

Chiranjeevi : చిరంజీవితో మరోసారి నటించనున్న ఒకప్పటి టాప్ హీరోయిన్.. ట్వీట్ వైరల్..

చిరంజీవి (File/Photo)

చిరంజీవి (File/Photo)

Chiranjeevi : చిరంజీవి, ఒకప్పటి హీరోయిన్.. ఇప్పడు నిర్మాతగా రాణిస్తోన్న రాధిక (Radhika Sharath Kumar) నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రాజెక్ట్‌లో రాధిక, చిరంజీవితో నటించనున్నారట. గతంలో చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...

    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్‌‌ను జరుపుకుంటున్నాయి. మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. కాగా ఆయన మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి, ఒకప్పటి హీరోయిన్.. ఇప్పడు నిర్మాతగా రాణిస్తోన్న రాధిక (Radhika Sarath Kumar) నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రాజెక్ట్‌లో రాధిక, చిరంజీవితో నటించనున్నారట. గతంలో చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ తాజా ప్రాజెక్ట్ సినిమానా లేక ఏదైనా వెబ్ సిరీస్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన తాజాగా నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య మంచి అంచనాల నడుమ ఇటీవల విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో కీలకపాత్రలో కనిపించారు. చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన ఈ ‘ఆచార్య’ (Acharya )ను కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహించారు. ఆధ్యాత్మికాన్ని నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించారు.

    రామ్ చరణ్ (Ram Charan)  సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్‌లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది.

    Anchor Anasuya : కనకాంబరం రంగు చీరలో అందంగా అదరగొట్టిన యాంకర్ అనసూయ..

    ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్‌ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Chiranjeevi, Tollywood news

    ఉత్తమ కథలు