Radhika Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సతీమణి రాధికా కుమారస్వామి హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈమె ఓ ఛీటింగ్ కేసులో పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Radhika Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సతీమణి రాధికా కుమారస్వామి హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే కదా. కుట్టి రాధికగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాధికా కుమార స్వామి తొలి సినిమా నుంచే సంచలనాలకు తెరలేపారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈమె గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈమె ఓ ఛీటింగ్ కేసులో అడ్డంగా ఇరుక్కున్నారు. ఒక ఛీటింగ్లో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఖాతా నుంచి రాధిక కుమారస్వామికి భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్టు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. దీంతో ఈ విషయమై ఆమెను విచారించడానికి తమ ముందు హాజరు కావడానికి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేసారు. దీంతో ఈ శుక్రవారం రాధిక కుమారస్వామి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరై వారి ప్రశ్నలు సమాధానాలు ఇచ్చింది.
ఈ కేసులో నిందితుడు యువరాజ్ అలియాస్ స్వామి అనే 52 ఏళ్ల వ్యక్తి.. తాను ఓ ప్రముఖ సంస్థకు చెందిన కార్యకర్త అంటూ చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంత మంది యువకుల దగ్గర కొన్ని లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా సదరు నిందితుడి బ్యాంకు అకౌంట్ నుంచి రాధిక కుమారస్వామికి రూ. 75 లక్షల నగదు ట్రాన్స్ఫర్ అయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో రాధికను విచారణ నిమిత్తమై తమ కార్యాలయనికి పిలిపించి విచారించారు.
భర్త కుమారస్వామి, కూతురుతో రాధిక కుమారస్వామి (Twitter/Photo)
ఐతే.. యువరాజ్ అలియాస్ స్వామితో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని ఈ సందర్భంగా రాధిక కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. యువరాజ్‌కు ఓ సినిమా ప్రొడక్షన్ హౌస్ ఉంది. అతనో హిస్టారికల్ మూవీని తనతో తీస్తున్నట్టు ప్రకటించారు. ఆయనకు నాకు కొన్నేళ్లుగా తెలియడంతో వెంటనే ఆ సినిమా చేయడానికి ఓకే చెప్పాను. ముందుగా అతను నాకు రూ. 15 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తానని చెప్పి నా అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసాడు. మిగిలిన రూ. 60 లక్షలను అతని బామ్మర్ధి అకౌంట్ నుంచి తనకు బదిలీ చేసారని రాధిక కుమారస్వామి చెప్పుకొచ్చింది.
రాధిక కుమారస్వామి (File/Photo)
లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ నగదు యువరాజ్ ఖాతా నుంచి రాధిక కుమారస్వామి ఖాతాకు బదిలీ అయింది. ఇక యువరాజ్ తనుకు ఓ జ్యోతిష్యుడిగా తెలుసన్నారు. ఆయన తనకు చెప్పినవన్ని నిజమయ్యాయని పేర్కొంది. అతన్ని నేను ఎంతోగానో నమ్మాను. కానీ పోలీసులు యువరాజ్‌ను ఓ ఛీటింగ్ కేసులో అరెస్ట్ చేయడంతో నేను ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైనట్టు రాధిక కుమారస్వామి పేర్కొన్నారు. ఇక యువరాజ్ అలియాస్ స్వామిని డిసెంబర్ 16న పోలీసులు అరెస్ట్ చేయగా.. అతని ఇంటి నుంచి రూ. 91 కోట్ల విలువగల 100 చెక్కులను సీసీబీ సీజ్ చేసినట్టు తెలిపారు.
రాధిక కుమారస్వామి (File/Photo)
రాధిక కుమారస్వామి విషయానికొస్తే.. ఈమె కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలోనే ఆమె కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రహస్య వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. దాంతో పాటు ఆమె ప్రధాన పాత్రలో కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే ఉంది. పెళ్లైన తర్వా రాధిక కుమారస్వామిగా ఆమె ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఛీటింగ్ కేసుతో మరోసారి వార్తల్లో నిలిచింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.