Home /News /movies /

RADHESHYAM TEAM CLARIFIES ON RELEASE DATE MK

RadheShyam: రాధేశ్యాం రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇచ్చిన చిత్రయూనిట్...ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పాన్ ఇండియా సినిమాగా వస్తున్న రాధేశ్యాం సైతం జనవరి 14న విడుదల కానుండగా, ఆ సినిమా సైతం వాయిదా పడతుందనే వాదన మొదలైంది.

    RadheShyam:  రాధేశ్యాం విడుదల తేదీ విషయంలో జరుగుతున్న ప్రచారానికి యూవీ క్రియేషన్స్ సంస్థ క్లారిటీ ఇచ్చేసింది. ఇఫ్పటికే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అటు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సహా ఢిల్లీ, యూపీ ఇతర పట్టణాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుస్తాయని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చాయి. దీంతో ఇప్పుడు పెద్ద సినిమాల పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాగా రూపొందించన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి ఏడున విడుదల కావాల్సి ఉండగా, ఇప్పటికే వాయిదా పడింది. దీంతో మరో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న రాధేశ్యాం సైతం జనవరి 14న విడుదల కానుండగా, ఆ సినిమా సైతం వాయిదా పడతుందనే వాదన మొదలైంది. కానీ అలాంటిదేమీ లేదని ఇప్పటికే చిత్ర యూనిట్ తేల్చింది. చిత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి 14నే విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

    ఇదిలాఉంటే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది. మరోవైపు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే డార్లింగ్ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది. అయితే అటు సోషల్ మీడియాలో మాత్రం సినిమా రిలీజ్ పై పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే వీటిని నమ్మవద్దని చిత్రయూనిట్ పేర్కొంది. అయితే రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోవడంతో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయినప్పటికీ పాన్ ఇండియా సినిమా కావడంతో ఒమిక్రాన్ ప్రభావం రాధేశ్యాంపై పడబోతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో థియేటర్స్ ఆక్యుపెన్సీ 50 శాతంతో నడిచే అవకాశం ఉంది. దీంతో  రాబోయే వారం రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

    అయితే జనవరి 14నే 'రాధే శ్యామ్' సినిమాని విడుదల చేసే నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం కూడా రాధేశ్యాంకు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్యాన్ ఇండియా మొత్తంలో ప్రమోషన్స్, స్పెషల్ ఇంటర్వూలు ప్లాన్ చేయాలని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.



    ఇదిలా ఉంటే ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ''రాధే శ్యామ్'' సినిమా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం హస్త సాముద్రికం నేపథ్యంలో నడిచే కథగా టీజర్స్, ట్రైలర్స్ న బట్టి తెలుస్తోంది. ఇందులో హస్తసాముద్రిక శాస్త్రంలో ఐన్ స్టీన్ గా విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ అలరించనున్నారు. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Prabhas, Radhe Shyam

    తదుపరి వార్తలు