Radhe Shyam: మంచులో ప్రభాస్, పూజా రొమాన్స్.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు శివరాత్రి గిఫ్ట్

రాధే శ్యామ్ పోస్టర్

పోస్టర్‌లో ప్రభాస్, పూజా హెగ్డే రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఇద్దరు వ్యతిరేక దిశలో పడుకొని.. ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఆ ఫొటోలను పూజా హెగ్డే ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేశారు.

  • Share this:
    రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు శివరాత్రి గిఫ్ట్ వచ్చేసింది. రాధే శ్యామ్ మూవీకి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్, పూజా హెగ్డే రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఇద్దరు వ్యతిరేక దిశలో పడుకొని.. ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఆ ఫొటోలను పూజా హెగ్డే ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేశారు. ''కొందరు దీన్ని పిచ్చి అంటారు. కానీ మేం ప్రేమగా పిలుచుకుంటాం. ఈ ప్రేమగాథ మీ హృదయాల్లో చిరకాలం చిలిచిపోతుంది'' అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    స్పెషల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రభాస్, పూజా హెగ్డే జోడి చూడచక్కగా ఉందని ఫ్యాన్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. శివరాత్రి వేళ ఈ సడన్ సర్‌ప్రైజ్‌కు డార్లింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు


    రాధేశ్యామ్ మూవీకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. రాధేశ్యామ్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. 1960 దశకం నాటి కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మూవీని రూపొందించారు. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

    ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సలార పేరుతో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్’గా చేస్తోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: