Prabhas - Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు రాధేశ్యామ్ నిర్మాతల షాక్... రిలీజ్ డేట్ మారుతుందా?

Radhe Shyam producers to shock Prabhas fans by changing release date

Prabhas - Radhe Shyam: ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ రిలీజ్‌ విషయంలో దర్శక నిర్మాతలు పునరాలోచనలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    అసలే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పిచ్చ కోపం మీదున్నారు. ఎవరి మీద అని అనుకుంటున్నారా? ఇంకేవరిమీదనో కాదు.. తమ అభిమాన హీరోతో సినిమా చేస్తున్న దర్శకుడు, నిర్మాతలపై. అభిమాన హీరోతో సినిమాలు చేస్తున్న వారిపై ఫ్యాన్స్‌కు ఇష్టం ఉండాలి కానీ.. కోపం ఎందుకు? అనే సందేహం రావచ్చు. కానీ 'రాధేశ్యామ్' విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రం డైరెక్టర్‌ రాధాకృష్ణ కుమార్‌, నిర్మాణ సంస్థలపై గుర్రుగా ఉన్నారనే మాట మాత్రం వాస్తవం. అందుకు కారణం. సాహో తర్వాత ప్రభాస్‌ చేస్తున్న రాధేశ్యామ్‌ సినిమాకు సంబంధించిన ఏదో పోస్టర్స్‌ తప్ప మరే అప్డేట్స్‌ లేవు. సంక్రాంతికి టీజర్‌ అయినా వస్తుందేమోనని అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. దీంతో నెటిజన్స్‌ రాధేశ్యామ్‌ టీమ్‌ను చాలా సార్లు ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఈ కోపాన్ని మరింత పెంచబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం. 'రాధేశ్యామ్‌'ను ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

    అయితే లేటెస్ట్‌ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు 'రాధేశ్యామ్‌' విడుదల సమ్మర్‌లో కాకుండా వెనక్కి వెళుతుందట. జూలై 12న ప్రభాస్‌ రాధేశ్యామ్‌ను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నారట. అందుకు కారణం.. ఏదో త్వరత్వరగా చేసేయాలనే ఉద్దేశంతో కాకుండా మంచి ఔట్‌పుట్‌ ఇవ్వాలనేది ఓ కారణమైతే.. మరో కారణం, 'రాధేశ్యామ్‌' ప్యాన్‌ ఇండియా మూవీ. కాబట్టి రిలీజ్‌ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కోవిడ్‌ కారణంగా స్టార్‌ హీరోలందరూ సమ్మర్‌లోనే వస్తున్నారు. దీంతో అప్పుడే వస్తే, ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఇబ్బందులు వచ్చే అవకాశం కాబట్టి.. జూలై 12న రాధేశ్యామ్‌ను విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు. అయితే 'రాధేశ్యామ్‌' విడుదలను వెనక్కి తోయడంపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈసారి ఏమంటారోననేది కూడా దర్శక నిర్మాతలు యోచిస్తున్నారట.

    ప్రభాస్‌, పూజా హెగ్డే జోడీగా రూపొందుతోన్న 'రాధేశ్యామ్‌' పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోంది. ప్రభాస్‌, కృష్ణంరాజు మద్య కొన్ని సన్నివేశాలు మినహా దాదాపు చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుందని సమాచారం.
    Published by:Anil
    First published: