Home /News /movies /

RADHE SHYAM PRABHAS POOJA HEGDE MOVIE NAGUMOMU THAARALE SONG PROMO RELEASED TA

Prabhas - Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్..

రాధే శ్యామ్ ‘నగుమోము తారలే’ ప్రోమో రిలీజ్ (Twitter/Photo)

రాధే శ్యామ్ ‘నగుమోము తారలే’ ప్రోమో రిలీజ్ (Twitter/Photo)

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్   హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయనున్నారు.

ఇంకా చదవండి ...
    Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్   హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆషికీ ఆ గయీ అంటూ రొమాంటిక్ సాంగ్ టీజర్ విడుదలైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్ వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి నగుమోము తారలే అంటూ సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. ఈ సినిమా పాటను డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సంక్రాంతి బరిలో రాధేశ్యామ్‌తో పాటు ఆర్ ఆర్ ఆర్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు విడుదలకానున్నాయి.

    ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. సముద్రపు తీరంలో పాట చాలా రిచ్‌గా కనిపిస్తుంది. హిందీ వర్షన్‌కు మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి పాట డిసెంబర్ 1న విడుదల కానుంది. కేకే (కృష్ణకాంత్) రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు.


    ఇక 'సాహో' తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. దీనికి తోడు వరుస హిట్లతో ఉన్న పూజ హెగ్డే నుంచి కొత్త ఏడాదిలో వస్తున్న మొదటి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారని తెలుస్తోంది.

    RRR : ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్.. ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..


    ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఆ మధ్య ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రాధే శ్యామ్ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించిందనే చెప్పోచ్చు. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. రాధే శ్యామ్ తెలుగు టీజర్ టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులను చెరిపివేసింది. ఈ టీజర్ విడుదలైన కేవలం 20 గంటల్లోనే, యూట్యూబ్‌లో 35 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని సాధించింది. టీజర్‌కు కూడా అర మిలియన్‌కు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇక ఈ టీజర్‌లో ప్రభాస్ చేసిన విక్రమాదిత్య పాత్రను పరిచయం చేశారు. ప్రభాస్ పాత్రను ఓ లెవల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల భవిష్యత్తు చెప్పే వాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

    Punarjanma - Radhe Shyam : తెలుగు సినిమాల్లో పునర్జన్మలు.. మగధీర,అరుంధతి, ఇపుడు రాధే శ్యామ్..


    ఈ సినిమాలో పూజ హెగ్డే ప్రేరణ పాత్రలో పూజా కనపడనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సినిమా మాత్రం విజువల్ వండర్‌గా ఉంది.

    Chiranjeevi : ఫామ్‌లో లేని ఒకప్పటి టాప్ డైరెక్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్..?


    రాధేశ్యామ్ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిసింది. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించారు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల కానుంది.

    Mahesh Babu: మహేష్ బాబు సినీ కెరీర్‌లో ఈ రోజు వెరీ వెరీ స్పెషల్.. పండగ చేసుకుంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..


    ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్‌ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

    Kalyan Ram - Bimbisara: ఎవరీ బింబిసార..? ఏంటి చరిత్ర..?.. ఆసక్తిరేకిస్తోన్న కళ్యాణ్ రామ్ కొత్త మూవీ టైటిల్..


    ఇక ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రభాస్ హీందీ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదిపురుష్ (Adipurush) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం తాజాగా చిత్రికరణను పూర్తి చేసుకుంది. దీంతో ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుంది.

    2022 Bollywood Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..


    ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నారు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వీటితో పాటు ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే డిసెంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు