హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ హిందీ బిజినెస్ ఎంత చేసింది.. లాభాల్లోకి రావాలంటే ఎంత కలెక్ట్ చేయాలంటే..

Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ హిందీ బిజినెస్ ఎంత చేసింది.. లాభాల్లోకి రావాలంటే ఎంత కలెక్ట్ చేయాలంటే..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ (Twitter/Photo)

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ (Twitter/Photo)

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా హిందీ వెర్షన్‌లో ఎంత బిజినెస్ చేసిందంటే..

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు సినిమాలతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. అంతేకాదు అప్పట్లో ఎన్నికల ప్రచారంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం బాహుబలి సినిమాను పలు సందర్భాల్లో ప్రస్తావించిన సందర్భాలున్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా తెలుగులో ఫ్లాప్ టాక్ వచ్చినా.. నార్త్ రీజియన్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.

’సాహో’ విడుదలైన రెండేళ్ల తర్వాత ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మరో కొన్ని గంటల్లో విడుదల కానుంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు అదిరిపోయే అవకాశాలున్నాయి. మొత్తంగా అక్కడ ఈ సినిమాను రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

Top Tollywood Movies Pre Release Business : ‘బాహుబలి’ టూ ’రాధే శ్యామ్’ వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఇవే..

మొత్తంగా అక్కడ రూ. 110 కోట్ల రేంజ్‌లో నెట్ కలెక్షన్స్‌ను రాబట్టాలి. నెట్ కలెక్షన్స్‌లో రెంట్స్, టాక్స్, మెయింటెన్స్ తీసేస్తే షేర్ వస్తోంది. మొత్తంగా సాహో కలెక్షన్స్‌లలో సగానికి పైగా బిజినెస్‌తో ‘రాధే శ్యామ్’ బాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. ఇప్పటికే  విడుదలైన ‘రాధేశ్యామ్’ ట్రైలర్‌, ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ మూవీ విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ సహా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌కు అంతా సిద్ధమైంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ సహా చిత్ర యూనిట్ జోరుగా ప్రచారం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.  ఈ సినిమాలో విక్రమ్  విక్రమాదిత్య అనే హస్త సాముద్రికుడి పాత్రలో నటించారు. భవిష్యత్తు తెలిసే అతీంద్రియ శక్తులున్న వ్యక్తి పాత్రల కనిపించనున్నారు.

Chiranjeevi : చిరంజీవి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా.. తెర వెనక ఆసక్తికర కథనం..


ప్రభాస్ .. ‘రాధే శ్యామ్’ విషయానికొస్తే..  ఈ సినిమాలో  ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ ట్రాక్ ఓ రేంజ్‌లో ఉండబోతుందనే విషయం ట్రైలర్‌లో చూపించారు.  ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉంది. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వాల్డ్ వైడ్‌గా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 204 కోట్లు రాబట్టాలి.

First published:

Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood