హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam : ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ ఫస్ట్ ప్రీమియర్ షో అక్కడే..

Radhe Shyam : ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ ఫస్ట్ ప్రీమియర్ షో అక్కడే..

‘రాధే శ్యామ్’ (Twitter/Photo)

‘రాధే శ్యామ్’ (Twitter/Photo)

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా ఈ సినిమా ప్రీమియర్స్‌కు సంబంధించి అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు.

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు సినిమాలతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది.  బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా తెలుగులో ఫ్లాప్ టాక్ వచ్చినా.. నార్త్ రీజియన్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.’సాహో’ విడుదలైన రెండేళ్ల తర్వాత ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మరో కొన్ని గంటల్లో విడుదల కానుంది.

పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు అదిరిపోయే అవకాశాలున్నాయి. మొత్తంగా అక్కడ ఈ సినిమాను రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తాజాగా రాధే శ్యామ్ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్‌ను హైదరాబాద్ కూకట్‌పల్లి థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్స్ టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.

హైదరాబాద్‌లో ‘రాధే శ్యామ్’ ప్రీమియర్ షో (Twitter/Photo)

తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగులో దాదాపు 1800 థియేటర్స్‌లో విడుదల కానుంది రాధే శ్యామ్. అంటే ఉన్న థియేటర్స్‌లో దాదాపు 85 శాతం ఇదే ఉండబోతుందన్నమాట.ఏపీలో టికెట్ రేట్లు కూడా ఓ కొలిక్కి రావడంతో కచ్చితంగా రికార్డు ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కనీసం రూ. 40 కోట్ల షేర్ వచ్చేలా కనిపిస్తుంది ఈ చిత్రం. మరోవైపు హిందీ, ఓవర్సీస్ నుంచి కూడా కచ్చితంగా రికార్డు కలెక్షన్స్ రాబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రాధే శ్యామ్ టార్గెట్ కనీసం రూ. 75 కోట్లు షేర్. ఎందుకంటే హిందీలోనూ ఈ సినిమా రూ. 20 కోట్ల ఓపెనింగ్ తీసుకురావడం ఖాయం.

కర్ణాటక: రూ. 12.50 కోట్లు

తమిళనాడు: రూ. 6 కోట్లు

కేరళ: రూ. 2.10 కోట్లు

హిందీ: రూ. 50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: రూ. 3 కోట్లు

ఓవర్సీస్ : రూ. 24 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మొత్తంగా ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 204 కోట్ల రాబట్టాలి.

Chiranjeevi : చిరంజీవి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా.. తెర వెనక ఆసక్తికర కథనం..

ఇక ఈ సినిమాలో విజువల్ వండర్  అనిపించే షిప్, సముద్రపు సన్నివేశాలు కూడా ఉన్నాయి.ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్.. మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్ర యువకుడి పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యే థియేటర్స్‌లో  జ్యోతిష్కులతో ఒక అస్ట్రాలజీ చెప్పే కౌంటర్స్ ఓపెన్ చేశారు.  ఇప్పటికే ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్ జ్యోతిషం చెప్పించుకున్నారు. ఈ సినిమాలో వివిధ దేశాధినేతలు, ప్రధానులకు, వివిధ ప్రముఖులకు జ్యోతిషం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో ఒదిగిపోయారు ప్రభాస్. రాధే శ్యామ్ మూవీ క్లైమాక్స్ హాలీవుడ్ మూవీ టైటానిక్ క్లైమాక్స్‌ను మించి ఈ సినిమాలో క్లైమాక్స్ ఉండబోతుందని అంటున్నారు. లవ్ అండ్ డెస్టీనీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

First published:

Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

ఉత్తమ కథలు