Home /News /movies /

RADHE SHYAM FAME PRABHAS ANOTHER RECORD HERE ARE THE DETAILS TA

Prabhas : అక్కడ నెంబర్ ప్లేస్ కొట్టేసిన ప్రభాస్.. రెబల్ స్టార్ దూకుడు ఓ రేంజ్‌లో ఉందిగా..

ప్రభాస్ (Twitter/Photo)

ప్రభాస్ (Twitter/Photo)

Prabhas : ప్రభాస్ ఎపుడైతే.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ‘బాహుబలి’ (Bahubali) సినిమా చేసాడో.. ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది.

  Prabhas : ప్రభాస్ ఎపుడైతే.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ‘బాహుబలి’ (Bahubali) సినిమా చేసాడో.. ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా దూకుడు చూపెడుతున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన ‘సాహో’ బ్యాడ్ టాక్‌తో దాదాపు రూ. 400 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే కదా.  అంతేకాదు దక్షిణాది నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహంగా కొలువైన హీరోగా రికార్డులకు ఎక్కారు. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. 2021 యేడాదికి గాను నంబర్ 1 సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ అనే ప్రముఖ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకున్నారు.

  ఐతే.. ఈ జాబితాలో మొత్తం ఆసియా ఖండం నుంచి 50 మంది సెలబ్రిటీలు పోటీపడగా.. అందులో ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.

  Punarjanma - Radhe Shyam : తెలుగు సినిమాల్లో పునర్జన్మలు.. మగధీర,అరుంధతి, ఇపుడు రాధే శ్యామ్..


  ఈ సినిమాలో పూజ హెగ్డే ప్రేరణ పాత్రలో పూజా కనపడనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సినిమా మాత్రం విజువల్ వండర్‌గా ఉంది.

  Balakrishna - Akhanda : ‘అఖండ’ సహా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారా తెలుసా..


  రాధేశ్యామ్ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిసింది. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించారు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల కానుంది.

  Mahesh Babu: మహేష్ బాబు సినీ కెరీర్‌లో ఈ రోజు వెరీ వెరీ స్పెషల్.. పండగ చేసుకుంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..


  ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్‌ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

  Celebrities Marriages 2021 : విక్కీ కౌశల్, కత్రినా సహా ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కిన సినీ ప్రముఖులు..


  ఇక ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రభాస్ హీందీ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదిపురుష్ (Adipurush) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం తాజాగా చిత్రికరణను పూర్తి చేసుకుంది. దీంతో ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుంది.

  2022 Bollywood Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..


  ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నారు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వీటితో పాటు ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే డిసెంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Adipurush, Bollywood news, Prabhas, Project K, Radhe Shyam, Salaar, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు