Home /News /movies /

Radhe Shyam Aashiqui Aa Gayi song: ‘రాధే శ్యామ్’ నుంచి రొమాంటిక్ సాంగ్ ఆషికీ ఆ గయి పాట విడుదల..

Radhe Shyam Aashiqui Aa Gayi song: ‘రాధే శ్యామ్’ నుంచి రొమాంటిక్ సాంగ్ ఆషికీ ఆ గయి పాట విడుదల..

‘రాధే శ్యామ్’ ఆషికీ ఆ గయూ సాంగ్ విడుదల (Twitter/Photo)

‘రాధే శ్యామ్’ ఆషికీ ఆ గయూ సాంగ్ విడుదల (Twitter/Photo)

Radhe Shyam Aashiqui Aa Gayi song:  ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్   హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమాలోని హిందీ వెర్షన్‌కు సంబంధించిన ‘ఆషికీ ఆ గయి’ పాటను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  Radhe Shyam Aashiqui Aa Gayi song:  ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్   హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆషికీ ఆ గయీ అంటూ రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్ వైరల్ అవుతుంది. తాజాగా హిందీ సినిమాకు సంబంధించిన ఆషికీ ఆ గయి సాంగ్‌ను విడుదల చేసారు. ఆషికి 2, కబీర్ సింగ్ సినిమాకు మ్యాజిక్ చేసిన మిథున్, అర్జీత్ సింగ్ కాంబినేషన్‌లో ఈ పాట రానుంది. ఈ పాట కచ్చితంగా అభిమానులకు నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు.

  సముద్రపు తీరంలో పాట చాలా రిచ్‌గా కనిపిస్తుంది. హిందీ వర్షన్‌కు మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా రాధే శ్యామ్‌. ఈ సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు.

  ఇది గొప్ప ప్రేమ‌క‌థ అని మెష‌న్ పోస్ట‌ర్‌తోనే రివీల్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన విక్రమాదిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్.. ఈ రాతలే పాటకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రాతలే పాటకు ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాసింది ఈ పాట. అలాగే ఈ పాటలో పంచభూతాలను కలిపి చూపించారు.

  Sirivennala Seetharama Sastry : చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ సహా సీతారామశాస్త్రికి పలువురు ప్రముఖుల నివాళులు..


  వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా రాధే శ్యామ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. తాజాగా ఈ సినిమా One Heart.. Two HeartBeats.. పోస్టర్ విడుదలైంది. అంటే ఒకే సినిమానే అయినా కూడా రెండు భాషలకు కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన సంగీతం అందించబోతున్నారని దీని అర్థం. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ డార్లింగ్‌ని సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేశారు. దీనికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

  ఇద్దరం కలిసి అది తాగుదాం.. సీతారామశాస్త్రికి రామ్ గోపాల్ వర్మ విభిన్న నివాళి..

  అందుకే ఒకే గుండెకు రెండు చప్పుళ్లు అనే పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి.

  Sirivennela - SP Balu : 2020లో ఎస్పీ బాలు.. 2021లో సీతారామశాస్త్రి.. కుప్పకూలిన తెలుగు చిత్ర పరిశ్రమ సాహితీ సౌరభాలు..

  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

  తదుపరి వార్తలు