హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam 4 days WW collections: ‘రాధే శ్యామ్’ 4 డేస్ కలెక్షన్స్.. దారుణంగా పడిపోయిన వసూళ్లు..

Radhe Shyam 4 days WW collections: ‘రాధే శ్యామ్’ 4 డేస్ కలెక్షన్స్.. దారుణంగా పడిపోయిన వసూళ్లు..

Radhe Shyam 4 days WW collections: ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమా వసూళ్లు ఊహించని విధంగా పడిపోయాయి. నాలుగో రోజు మరీ దారుణంగా వచ్చాయి ఈ చిత్ర కలెక్షన్స్. తెలుగు రాష్ట్రాల్లో అయితే కేవలం 2.11 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.

ఇంకా చదవండి ...

ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమా వసూళ్లు ఊహించని విధంగా పడిపోయాయి. నాలుగో రోజు మరీ దారుణంగా వచ్చాయి ఈ చిత్ర కలెక్షన్స్. తెలుగు రాష్ట్రాల్లో అయితే కేవలం 2.11 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలలో అత్యంత దారుణంగా పడిపోయిన వసూళ్లు ఇవే. భీమ్లా నాయక్ కూడా నాలుగో రోజు 9 కోట్లకు పైగానే వసూలు చేసింది. కానీ రాధే శ్యామ్ మాత్రం గణనీయంగా పడిపోయింది. మొదటి రోజే ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హిందీలోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి. నాలుగు రోజుల్లో కేవలం 75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. లక్ష్యానికి ఇంకా 127 కోట్ల దూరంలో ఉంది. ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూడటానికి ప్రేక్షకులు అస్సలు ఇష్టపడలేదని ఈ సినిమా వసూళ్లతో అర్థమవుతుంది. ఒక్కసారి ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి.. ఇంకా ఎంత రావాలి.. ఈ వివరాలన్నీ ఓసారి చూద్దాం..

నైజాం: 23.26 కోట్లు

సీడెడ్: 6.95 కోట్లు

ఉత్తరాంధ్ర: 4.48 కోట్లు

ఈస్ట్: 4.02 కోట్లు

వెస్ట్: 3.11 కోట్లు

గుంటూరు: 4.22 కోట్లు

కృష్ణా: 2.46 కోట్లు

నెల్లూరు: 2.00 కోట్లు

ఏపీ, తెలంగాణ 4 డేస్ కలెక్షన్స్: 50.50 కోట్లు

కర్ణాటక: 4.10 కోట్లు

తమిళనాడు: 0.68 కోట్లు

కేరళ: 0.15 కోట్లు

హిందీ: 7.50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 1.48 కోట్లు

ఓవర్సీస్: 10.90 కోట్లు

4 డేస్ వరల్డ్ వైడ్ టోటల్: 75.75 కోట్లు షేర్

Tollywood heroes wives: ఆడవాళ్లు మీకు జోహార్లు.. సోషల్ మీడియాలో రప్ఫాడిస్తున్న హీరోల భార్యలు..

ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 202 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే 106 కోట్లు వస్తే కానీ సేఫ్ అవ్వదు. మరోవైపు హిందీలో 50 కోట్లకు అమ్మారు. ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం బయ్యర్లకు భయం తప్ప ఇంకేం లేదు. మరో 127 కోట్ల దూరంలో ఉన్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యం. సాహో కంటే కూడా చాలా తక్కువ వచ్చాయి వసూళ్లు. సాహోకు నెగిటివ్ టాక్ వచ్చినా 217 కోట్ల షేర్ వసూలు చేసింది.

First published:

Tags: Box Office Collections, Prabhas, Radhe Shyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు