హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam 1st week WW collections: ‘రాధే శ్యామ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. పాన్ ఇండియన్ డిజాస్టర్..

Radhe Shyam 1st week WW collections: ‘రాధే శ్యామ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. పాన్ ఇండియన్ డిజాస్టర్..

Radhe Shyam 1st week WW collections: ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమా వసూళ్లు ఊహించని విధంగా పడిపోయాయి. నిజానికి తొలిరోజు నుంచే ఈ చిత్రానికి ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు.

ఇంకా చదవండి ...

ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమా వసూళ్లు ఊహించని విధంగా పడిపోయాయి. నిజానికి తొలిరోజు నుంచే ఈ చిత్రానికి ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు. మూడు రోజుల తర్వాత మరింత దారుణంగా పడిపోయాయి వసూళ్లు. ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలలో అత్యంత దారుణంగా పడిపోయిన వసూళ్లు ఇవే. భీమ్లా నాయక్ కంటే తక్కువగా వచ్చాయి ఈ చిత్రానికి కలెక్షన్స్. పాన్ ఇండియన్ అయినా కూడా అన్ని చోట్లా డిజాస్టర్ అయిపోయింది రాధే శ్యామ్. లక్ష్యానికి ఇంకా 124 కోట్ల దూరంలో ఉంది. ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూడటానికి ప్రేక్షకులు అస్సలు ఇష్టపడలేదని ఈ సినిమా వసూళ్లతో అర్థమవుతుంది. ఒక్కసారి ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి.. ఇంకా ఎంత రావాలి.. ఈ వివరాలన్నీ ఓసారి చూద్దాం..

నైజాం: 24.20 కోట్లు

సీడెడ్: 7.24 కోట్లు

ఉత్తరాంధ్ర: 4.68 కోట్లు

ఈస్ట్: 4.19 కోట్లు

వెస్ట్: 3.23 కోట్లు

గుంటూరు: 4.37 కోట్లు

కృష్ణా: 2.59 కోట్లు

నెల్లూరు: 2.09 కోట్లు

ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 52.59 కోట్లు

కర్ణాటక: 4.18 కోట్లు

తమిళనాడు: 0.75 కోట్లు

కేరళ: 0.18 కోట్లు

హిందీ: 8.95 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 1.58 కోట్లు

ఓవర్సీస్: 11.30 కోట్లు

ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ టోటల్: 79.36 కోట్లు షేర్

ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 202 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే 106 కోట్లు వస్తే కానీ సేఫ్ అవ్వదు. మరోవైపు హిందీలో 52.59 కోట్లకు అమ్మారు. ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం బయ్యర్లకు భయం తప్ప ఇంకేం లేదు. మరో 124 కోట్ల దూరంలో ఉన్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యం. సాహో కంటే కూడా చాలా తక్కువ వచ్చాయి వసూళ్లు. సాహోకు నెగిటివ్ టాక్ వచ్చినా 217 కోట్ల షేర్ వసూలు చేసింది.

First published:

Tags: Box Office Collections, Radhe Shyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు