హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam 1st Day WW collections: ‘రాధే శ్యామ్’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. నిరాశ పరిచిన ప్రభాస్ లవ్ స్టోరీ..

Radhe Shyam 1st Day WW collections: ‘రాధే శ్యామ్’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. నిరాశ పరిచిన ప్రభాస్ లవ్ స్టోరీ..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ (Twitter/Photo)

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ (Twitter/Photo)

Radhe Shyam 1st Day WW collections: ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హిందీలోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి.

ఇంకా చదవండి ...

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హిందీలోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు అక్కడ కేవలం 2.4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మరోవైపు మిగిలిన రాష్ట్రాలలో సైతం ఈ సినిమాకు ఊహించిన కలెక్షన్స్ అయితే రాలేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రికార్డు కూడా క్రియేట్ చేయలేకపోయింది రాధే శ్యామ్. ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూడటానికి ప్రేక్షకులు అస్సలు ఇష్టపడలేదని ఈ సినిమా వసూళ్లతో అర్థమవుతుంది. ఒక్కసారి ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి.. ఇంకా ఎంత రావాలి.. ఈ వివరాలన్నీ ఓసారి చూద్దాం..

నైజాం: 10.80 కోట్లు

సీడెడ్: 3.50 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.95 కోట్లు

ఈస్ట్: 2.60 కోట్లు

వెస్ట్: 2.01 కోట్లు

గుంటూరు: 2.60 కోట్లు

కృష్ణా: 0.95 కోట్లు

నెల్లూరు: 1.08 కోట్లు

ఏపీ, తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్: 25.49 కోట్లు

కర్ణాటక: 2.70 కోట్లు

తమిళనాడు: 0.30 కోట్లు

కేరళ: 0.08 కోట్లు

హిందీ: 2.25 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 0.80 కోట్లు

ఓవర్సీస్: 6.75 కోట్లు

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ టోటల్: 38.37 కోట్లు షేర్

Bellamkonda Suresh: నా పిల్లలే నా ప్రాణం.. వాళ్ల జోలికి వస్తే అంతు చూస్తా.. నిర్మాత బెల్లంకొండ సురేష్ ఫైర్..

ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 202 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే 106 కోట్లు వస్తే కానీ సేఫ్ అవ్వదు. మరోవైపు హిందీలో 50 కోట్లకు అమ్మారు. ఇప్పుడు వచ్చిన ఓపెనింగ్స్ చూస్తుంటే మాత్రం బయ్యర్లకు భయం తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే వీకెండ్ అయ్యేలోపు కనీసం 150 కోట్ల వరకు వస్తే కానీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. కానీ మొదటి రోజు కేవలం 38 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. భీమ్లా నాయక్ లాంటి సినిమాలకే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. పాన్ ఇండియన్ రేంజ్ సినిమాకు ఇలా రావడం ఏంటో అర్థం కాక తల పట్టుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. సాహో కంటే కూడా చాలా తక్కువ వచ్చాయి వసూళ్లు. సాహోకు మూడేళ్ల ముందే మొదటి రోజు 130 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ రాధే శ్యామ్ 66 కోట్లతోనే సరిపెట్టుకుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Box Office Collections, Radhe Shyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు