హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam Pre Release Business : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలి అంటే..

Radhe Shyam Pre Release Business : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలి అంటే..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

Prabhas - Radhe Shyam Pre Release Business : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసిందంటే..

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే  విడుదలైన ‘రాధేశ్యామ్’ ట్రైలర్‌, ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ మూవీ విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ సహా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌కు అంతా సిద్ధమైంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ సహా చిత్ర యూనిట్ జోరుగా ప్రచారం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.  ఈ సినిమాలో విక్రమ్  విక్రమాదిత్య అనే హస్త సాముద్రికుడి పాత్రలో నటించారు. భవిష్యత్తు తెలిసే అతీంద్రియ శక్తులున్న వ్యక్తి పాత్రల కనిపించనున్నారు.

ప్రభాస్ .. ‘రాధే శ్యామ్’ విషయానికొస్తే..  ఈ సినిమాలో  ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ ట్రాక్ ఓ రేంజ్‌లో ఉండబోతుందనే విషయం ట్రైలర్‌లో చూపించారు.  ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉంది. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే..

నైజాం (తెలంగాణ): రూ. 36.50 కోట్లు

సీడెడ్ (రాయలసీమ): రూ. 18 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 13 కోట్లు

ఈస్ట్: రూ. 8.80 కోట్లు

వెస్ట్: రూ. 7.50 కోట్లు

గుంటూరు: రూ. 9.90 కోట్లు

కృష్ణా:  రూ. 7.50 కోట్లు

నెల్లూరు: రూ. 4 కోట్లు

తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : 105.20 కోట్లు

కర్ణాటక: రూ. 12.50 కోట్లు

తమిళనాడు: రూ. 6 కోట్లు

కేరళ: రూ. 2.10 కోట్లు

హిందీ: రూ. 50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: రూ. 3 కోట్లు

ఓవర్సీస్ : రూ. 24 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మొత్తంగా ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 204 కోట్ల రాబట్టాలి.

Radhe Shyam : ప్రభాస్ ’రాధే శ్యామ్’ సహా సినీ ఇండస్ట్రీలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..


ఇక ఈ సినిమాలో విజువల్ వండర్  అనిపించే షిప్, సముద్రపు సన్నివేశాలు కూడా ఉన్నాయి.ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్.. మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్ర యువకుడి పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యే థియేటర్స్‌లో  జ్యోతిష్కులతో ఒక అస్ట్రాలజీ చెప్పే కౌంటర్స్ ఓపెన్ చేశారు. ఇక్కడ సినిమాకు వచ్చే ప్రేక్షకులు ఫ్రీగా జ్యోతిషం చెప్పుంచుకోవచ్చు. ఇప్పటికే ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్ జ్యోతిషం చెప్పించుకున్నారు. ఈ సినిమాలో వివిధ దేశాధినేతలు, ప్రధానులకు, వివిధ ప్రముఖులకు జ్యోతిషం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో ఒదిగిపోయారు ప్రభాస్. రాధే శ్యామ్ మూవీ క్లైమాక్స్ హాలీవుడ్ మూవీ టైటానిక్ క్లైమాక్స్‌ను మించి ఈ సినిమాలో క్లైమాక్స్ ఉండబోతుందని అంటున్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఈ  సినిమా తెలుగు వెర్షన్‌కు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించారు.

Rana - Pooja Hegde : రానా దగ్గుబాటి, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ మూవీ తెలుసా..


హిందీలో అమితాబ్ బచ్చన్, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా కోసం గాత్ర దానం చేసారు. ఈ సినిమాకు వివిధ భాషల్లో వేరు వేరు సంగీత దర్శకులు పనిచేశారు. దక్షిణాదికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.  పైగా దేశంలో హిందీ చిత్ర పరిశ్రమకు గుండె కాయ వంటి ముంబైలో కరోనా కేసులో తగ్గడంతో 100 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్‌ రన్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడం ఇపుడు ప్యాన్ ఇండియా మూవీ అయిన ‘రాధే శ్యామ్‌’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ మిగతా హిందీ చిత్రాలకు కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. మొత్తంగా మరికొన్ని గంటల్లో  విడుదల కానున్న ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి.

First published:

Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

ఉత్తమ కథలు