రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. ఆర్ఎక్స్ 100 దర్శకునితో..

Raashi Khanna : రాశీ ఖన్నాకు ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేవు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్‌ కావడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లైంది.

news18-telugu
Updated: June 30, 2020, 3:05 PM IST
రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. ఆర్ఎక్స్ 100 దర్శకునితో..
రాశీ ఖన్నా Photo : Twitter
  • Share this:
Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ పాల బుగ్గల రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా, అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమేనట. ఇక ఆమె ఇటీవల నాగచైతన్యతో నటించిన 'వెంకీమామ'.. సాయి తేజ్‌తో 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మరో మరో హిట్ దక్కుతుందని ఆశ పడితే అది రివర్స్ అయింది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ. అయితే తాజాగా మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించనున్న చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. సిద్ధార్థ్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా సాయి పల్లవి ఫైనల్ అవ్వగా.. తాజా సమాచారం ప్రకారం మరో హీరోయిన్‌గా రాశీ ఖన్నా ఓకే అయ్యిందని తెలుస్తోంది. ఇందులోని పాత్ర నచ్చేయడంతో రాశీ ఖన్నా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసినట్లు సమాచారం.
First published: June 30, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading