వరుస ప్లాపులతో సతమతమవుతోన్న రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. గోపిచంద్ మలినేని దర్శకుడు. ఈ సినిమా తరువాత రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్లో కనిపించనున్నడనేది టాక్. అందుకే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. అది అలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసిందట చిత్రబృందం. ఈ సాంగ్ కోసం అందాల రాశీ ఖన్నాను అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ పాటలో నటించడానికి ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి. అయితే ప్రస్తుతానికి రాశీ ఖన్నాకు తెలుగులో అవకాశాలు అంతంతమాత్రమే. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో రాశీ ఆ స్పెషల్‌లో సాంగ్‌లో నటించే ఆస్కారం ఎక్కువ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ ను నభా నటేష్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raashi Khanna, Ravi Teja, Tollywood news