Raashi Khanna : థ్రిల్ చేస్తానంటోన్న రాశీ ఖన్నా.. సోనీలివ్ కొత్త వెబ్ సిరీస్ కోసం బూరె బుగ్గల బ్యూటీ.....

Raashi Khanna Photo : Instagram

Raashi Khanna : బూరెల్లాంటి బుగ్గలతో ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది ఈ పాల బుగ్గల చిన్నది.

  • Share this:
    Raashi Khanna : బూరెల్లాంటి బుగ్గలతో ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది ఈ పాల బుగ్గల చిన్నది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడిడడంతో ఆ మధ్య స్లో అయింది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రంతో పాటు నాగచైతన్య విక్రమ్ కుమార్ థాంక్యూలో కూడా హీరోయిన్‌గా చేస్తోంది. ఇక అది అలా ఉంటే రాశీ ఖన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను అదరగొడుతోంది. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా.. తాజాగా మరో వెబ్ సిరీస్‌లో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. రాశీఖన్నా తెలుగులో ప్రసారం కానున్న సోనీ లివ్‌ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. సోనీ లివ్ ఇటీవల తెలుగు OTT స్పేస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోనీ లివ్ రాశీఖన్నాతో ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు కొత్త దర్శకుడు సూర్య వంగల దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఓ మిస్టరీ డ్రామాగా వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా డిటెక్టివ్ పాత్ర పోషించనుందట.

    ఇక రాశీఖన్నా థాంక్యూ సినిమా విషయానికి వస్తే.. ఈ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తుంది. విక్రమ్ ఆ మధ్య నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.



    ఆ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతన్య సోదరుడు అఖిల్ 'హలో' చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని టాక్. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: