చాలా ఏడ్చాను... విజయ్ భయపడ్డాడు : రాశీ ఖన్నా..

Raashi Khanna : రాశీ ఖన్నా, విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 9, 2020, 9:47 AM IST
చాలా ఏడ్చాను... విజయ్ భయపడ్డాడు : రాశీ ఖన్నా..
Instagram
  • Share this:
Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న రాశీ ఖన్నా కొత్త ఏడాదిలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (World Famous Lover) చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రచారంలో భాగంగా రాశీఖన్నా మీడియాతో మాట్లాడింది. ఈ సినిమాలో నేను చేసిన యామిని పాత్ర ఒక ఛాలెంజ్‌‌గా ఉంటుంది. నేను చేసిన పాత్రలతో పోలిస్తే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో పోషించిన యామిని కొత్తగా ఉంటుంది. గతంలో చేసిన పాత్రల కంటే ఈ పాత్రను చాలా ఫీల్‌ అయ్యి చేశాను. నేను రిలేషన్‌లో ఉంటే ఎలా ఉంటాను. అందులో భాగంగా వచ్చే పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాను అనే విషయాలను ఈ పాత్రతో చేయించారు. అయితే ఈ సినిమాలో నా పాత్ర చూసి అభిమానులు బాధపడ్డారు. కానీ సినిమా చూశాక తప్పకుండా నా అభిమానులు హ్యాపీగా ఫీలవుతారంది. ఈ (World Famous Lover) ట్రైలర్, టీజర్‌లు అర్జున్‌రెడ్డికి సీక్వెల్‌గా ఉన్నాయని అంటున్నారు.. అయితే ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అంతేకాదు ఓ సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్ కూడా ఉంది. అది ప్రేక్షకులకు కిక్ ఇస్తుందని తెలిపింది.
 View this post on Instagram
 

Tell me, how do you unmeet someone? #wfl


A post shared by Raashi Khanna (@raashikhannaoffl) on

రాశీ ఇంకా మాట్లాడుతూ.. ఈ (World Famous Lover) సినిమాలో యామిని క్యారెక్టర్‌కు నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యా.. అందులో భాగంగా కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్న సందర్బంగా ఏడ్చేసేదాన్ని. అది చూసి డైరెక్టర్‌ క్రాంతిమాధవ్‌, విజయ్‌ భయపడ్డారు కూడా. దీనికి కారణం యామిని పాత్రను ఫీల్‌ అయ్యానని తెలిపింది రాశీ.
First published: February 9, 2020, 9:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading