HOME »NEWS »MOVIE »raashi khanna reprise radhika apte character in andhadhun malayal remake mnj

Raashi Khanna: రాశికి క్రేజీ ఆఫర్.. అంధధున్ రీమేక్ లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ

Raashi Khanna: రాశికి క్రేజీ ఆఫర్.. అంధధున్ రీమేక్ లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
రాశి ఖన్నా

స‌న్న‌గా మారిన త‌రువాత ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా(Raashi Khanna)కు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. గ‌తేడాది వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ఒక్క సినిమాలోనే క‌నిపించిన ఈ బ్యూటీ.. ఇంత‌వ‌ర‌కు మ‌రో తెలుగు చిత్రానికి ఓకే చెప్ప‌లేదు. అయితేనేం మిగిలిన భాష‌ల్లో మాత్రం ఈ బ్యూటీకి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి

  • Share this:
    Rashi Khanna: స‌న్న‌గా మారిన త‌రువాత ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నాకు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. గ‌తేడాది వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ఒక్క సినిమాలోనే క‌నిపించిన ఈ బ్యూటీ.. ఇంత‌వ‌ర‌కు మ‌రో తెలుగు చిత్రానికి ఓకే చెప్ప‌లేదు. అయితేనేం మిగిలిన భాష‌ల్లో మాత్రం ఈ బ్యూటీకి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా త‌మిళ్, మ‌ల‌యాళంలో ఇప్పుడు రాశి బిజీగా మార‌బోతోంది. ఆ రెండు భాష‌ల్లో ఇప్ప‌టికే మూడు చిత్రాల్లో న‌టిస్తోన్ రాశికి ఇప్పుడు మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చింది. హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన అంధ‌ధూన్‌ని ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళంలో ఈ రీమేక్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

    ఈ క్ర‌మంలో మ‌ల‌యాళ అంధ‌ధూన్ రీమేక్‌లో రాశి ఖ‌న్నా న‌టిస్తోంది. మాతృక‌లో రాధికా ఆప్టే న‌టించిన పాత్ర‌లో రాశి న‌టించ‌నుంది. పృథ్వీరాజ్ ఈ రీమేక్‌లో న‌టిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ర‌వి కే చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ట‌బు పాత్ర‌లో మ‌మ‌తా మోహ‌న్‌దాస్ న‌టించ‌నుంది. బ్ర‌మ‌మ్ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ వ‌చ్చే వారం నుంచి షూటింగ్ జ‌రుపుకోనున్న‌ట్లు స‌మాచారం.


    View this post on Instagram

    A post shared by Raashi (@raashikhannaoffl)




    కాగా తెలుగులో అంధ‌ధూన్ రీమేక్‌లో నితిన్ న‌టిస్తున్నారు. త‌మ‌న్నా, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం అయ్యింది. ఇక త‌మిళ్‌లో ఈ హిట్ మూవీ రీమేక్‌లో ప్ర‌శాంత్ నటిస్తుండగా.. సిమ్రాన్ ఓ పాత్ర‌లో న‌టిస్తోంది. అంధగాన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ కూడా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోంది.
    Published by:Manjula S
    First published:January 25, 2021, 13:08 IST

    टॉप स्टोरीज