జగన్‌ను మెచ్చుకున్న రాశీ ఖన్నా...

రాశీ ఖన్నా..‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: December 15, 2019, 3:11 PM IST
జగన్‌ను మెచ్చుకున్న రాశీ ఖన్నా...
Twitter
  • Share this:
రాశీ ఖన్నా..‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది రాశీ. ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా వస్తోన్న 'ప్రతిరోజూ పండగే'లో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. అది అలా ఉంటే రాశీ మహిళల పై జరుగుతున్న ఘటనలపై స్పందించింది. మహిళపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏపీలో దిశ చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఏపీ శాసనసభ దిశ యాక్ట్ 2019కి ఆమోద ముద్ర వేసింది. కాగా ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తన సపోర్ట్ ను ప్రకటించారు.


ఈ విషయంపై తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని, ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాం అనే భయం ఉంటుందని, దీంతో తప్పు చెయ్యాలనుకునే వారు భయపడతారని చెబుతోంది. అంతేకాదు ఈ చట్టాన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని రాశీ ఖన్నా కామెంట్స్ చేసింది.
కేక పెట్టిస్తోన్న రాశీ ఖన్నా.. అదిరిపోయిన లేటెస్ట్ పిక్స్..
First published: December 15, 2019, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading