యామిని ఏడిపించేసింది.. చాలా కనెక్ట్ అయ్యాను : రాశీ ఖన్నా..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో క్యూట్ క్యూట్‌ లుక్స్‌తో తెలుగు వారికి పరిచయమైంది ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ.

news18-telugu
Updated: February 14, 2020, 10:52 AM IST
యామిని ఏడిపించేసింది.. చాలా కనెక్ట్ అయ్యాను : రాశీ ఖన్నా..
Instagram/raashikhannaoff
  • Share this:
Raashi Khanna : రాశీ ఖన్నా... ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో క్యూట్ క్యూట్‌ లుక్స్‌తో తెలుగు సినిమాలకు పరిచయమైంది. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.  ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న రాశీ ఖన్నా కొత్త ఏడాదిలో విజయ్ దేవరకొండతో కలిసి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (World Famous Lover)లో ఓ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదలవుతోంది. దీంతో ప్రచారంలో భాగంగా ఇటీవల రాశీఖన్నా మీడియాతో మాట్లాడింది. ఈ సినిమాలో తాను చేసిన యామిని పాత్ర ఓ ఛాలెంజ్‌‌గా ఉంటుందని చెబుతూ.. తాను చేసిన పాత్రలతో పోలిస్తే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో పోషించిన యామిని పాత్ర కొత్తగా ఉంటుందని పేర్కోంది. ఆమె ఇంకా మాట్లాడుతూ గతంలో చేసిన పాత్రల కంటే ఈ పాత్రను చాలా ఫీల్‌ అయ్యి చేశానని తెలిపింది. నేను రిలేషన్‌లో ఉంటే ఎలా ఉంటాను. అందులో భాగంగా వచ్చే పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాను అనే విషయాలను ఈ పాత్రతో చేయించారు.




 



View this post on Instagram




 

Yamini and Gautham ♥️ #wflfromtomorrow 🥰


A post shared by Raashi Khanna (@raashikhannaoffl) on





రాశీ ఇంకా మాట్లాడుతూ.. ఈ (World Famous Lover) సినిమాలో యామిని క్యారెక్టర్‌కు నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యా.. అందులో భాగంగా కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్న సందర్బంగా ఏడ్చేసేదాన్ని. అది చూసి డైరెక్టర్‌ క్రాంతిమాధవ్‌, విజయ్‌ భయపడ్డారు కూడా. దీనికి కారణం యామిని పాత్రను ఫీల్‌ అయ్యానని తెలిపింది రాశీ.  అయితే ఈ చిత్రంలో రాశి తన గత చిత్రాలకు భిన్నంగా కొంచెం బోల్డ్ రోల్ చేసింది. ఈ మూవీలో విజయ్‌తో ఆమెకు ఉన్న ఇంటిమసీ సీన్స్ చూశాక ఆమె ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారు. ఇదే విషయంపై రాశి ఖన్నా మాట్లాడుతూ... వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ టీజర్ విడుదల తరువాత నా పాత్రలోని ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ చూడకుండా అందరూ ఆ బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్ పెట్టారు. ఏంటి రాశీ ఇలా చేసింది అన్నారు. అప్పుడే నాకు అర్థమైంది నన్ను ఇంతలా ఫాలో అయ్యే ఫ్యాన్స్ నాకు ఉన్నారా అనిపించింది. అయితే ఒకసారి  ఆ సినిమా చూస్తే వారికే అర్ధం అవుతుంది.. అప్పుడు వారే నన్ను మెచ్చుకుంటారని తెలిపింది.
First published: February 14, 2020, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading