తొందరపడ్డాను.. తెలిసొచ్చింది... : రాశీఖన్నా

బూరెల్లాంటి బుగ్గల రాశీ ఖన్నా.. ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

news18-telugu
Updated: March 23, 2020, 9:28 AM IST
తొందరపడ్డాను.. తెలిసొచ్చింది... : రాశీఖన్నా
Instagram/raashikhannaoff
  • Share this:
Raashi Khanna : బూరెల్లాంటి బుగ్గలతో ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువాారి హృదయాలను దోచుకుంది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా, అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె ఇటీవల నటించిన 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇక వరుసగా మరో హిట్ దక్కుతుందని ఆశ పడితే అది రివర్స్ అయింది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ. దీంతో ఖంగుతిన్న రాశీ ఖన్నా.. ఈమధ్య ఓ సందర్భంలో తన లాస్ట్ సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' గురించి సన్నిహితులతో మాట్లాడుతూ ఆ సినిమా తనను నిరాశకు గురిచేసిందని చెప్పిందట. తన పాత్ర సంతృప్తిని కలిగించినప్పటికీ సినిమా డిజాస్టర్ కావడంతో ఇకపై తన పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త వహిస్తానని చెప్పుకొచ్చిందట. ఇక తొందరపడి నిర్ణయాలు తీసుకోను..  అని అంటోంది. అది అలా ఉంటే రాశీఖన్నా చేతిలో ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమా లేదు. తమిళ్‌లో ఓ రెండు సినిమాల్లో చేస్తుందని టాక్. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు దేవకట్టా, సాయి తేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఓ సినిమాలో రాశీని ఓ పాత్ర కోసం పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేథా పేతురాజ్ నటిస్తోంది.
First published: March 23, 2020, 9:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading