బాధపడుతూ ఏ సినిమాలోనూ నటించలేదు : రాశీఖన్నా..

Raashi Khanna : బూరెల్లాంటి బుగ్గలతో ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా.

news18-telugu
Updated: April 30, 2020, 2:37 PM IST
బాధపడుతూ ఏ సినిమాలోనూ నటించలేదు : రాశీఖన్నా..
రాశీఖన్నా Photo : Twitter
  • Share this:
Raashi Khanna : బూరెల్లాంటి బుగ్గలతో ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా, అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె ఇటీవల నటించిన 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇక వరుసగా మరో హిట్ దక్కుతుందని ఆశ పడితే అది రివర్స్ అయింది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండతో కలిసి చేసిన రొమాంటిక్‌ సన్నివేశాల గురించి రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిందని, ఇకపై అటువంటి హద్దులు మీరే సీన్లలో నటించబోనని ఆమె స్పష్టం చేసిందంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో... రాశీ ఖన్నా స్పందిస్తూ అసలు తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కోంది. తాను నటించిన ప్రతి సినిమాను ఆస్వాదిస్తూ నటించానని, బాధపడుతూ మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదని చెప్పింది. తాను నటించిన సినిమాలు విజయం సాధించినా, సాధించకపోయినా ప్రతి ఒక్క సినిమా ఓ అందమైన ప్రయాణమని తెలిపింది. రాశీఖన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..  తాను పోషించిన పాత్రలపై సానుకూలంగానే ఉంటానని తెలిపింది.అది అలా ఉంటే రాశీఖన్నా చేతిలో ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమా లేదు. తమిళ్‌లో ఓ రెండు సినిమాల్లో చేస్తుందని టాక్. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు దేవకట్టా, సాయి తేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఓ సినిమాలో రాశీని ఓ పాత్ర కోసం పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేథా పేతురాజ్ నటిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: April 30, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading