వెంకీ మామను బిగి కౌగిలిలో బంధించిన చైతూ భామ..

ఈ ఇయర్ వెంకటేష్‌తో పాటు ఆయన మేనల్లుడు నాగ చైతన్యకు బాగానే కలిసొచ్చింది. తాజాగా ఈ షూటింగ్ గ్యాప్‌లో రాశిఖన్నా.. వెంకటేష్‌ను హగ్ చేసుకుంది. అంతేకాదు ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: August 25, 2019, 4:37 PM IST
వెంకీ మామను బిగి కౌగిలిలో బంధించిన చైతూ భామ..
వెంకీమామ’ సెట్‌లో వెంకీ, రాశిఖన్నా (Twitter/Photo)
  • Share this:
ఈ ఇయర్ వెంకటేష్‌తో పాటు ఆయన మేనల్లుడు నాగ చైతన్యకు బాగానే కలిసొచ్చింది. వెంకటేష్.. చాలా రోజుల తర్వాత ‘ఎఫ్2’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. మరోవైపు నాగ చైతన్య కూడా ఎన్నోయేళ్ల తర్వాత ‘మజిలీ’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తాజాగా వీళ్లిద్దరు కలిసి ‘వెంకీ మామ’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. గతంలో వెంకటేష్.. నాగచైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’లో చైతూ మేనమామగా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఇపుడు పూర్తి స్థాయిలో వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారు.ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగ చైతన్యతో పక్కన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ షూటింగ్ గ్యాప్‌లో రాశిఖన్నా వెంకటేష్‌కు అభిమానిగా మారిపోయింది. అందుకే ‘వెంకీమామ’ షూటింగ్ గ్యాప్‌లో రాశిఖన్నా. వెంకటేష్‌‌ను హగ్ చేసుకొని ఒక ఫోటో దిగింది. ఇపుడా ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏమైనా రాశిఖన్నా.. వెంకటేష్‌తో దిగిన ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>