హోమ్ /వార్తలు /సినిమా /

రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. సూర్యతో రొమాన్స్‌కు అవకాశం..

రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. సూర్యతో రొమాన్స్‌కు అవకాశం..

రాశీ ఖన్నా Photo : Twitter

రాశీ ఖన్నా Photo : Twitter

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నాకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.

    Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా, అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమేనట. ఆమె ఇటీవల నటించిన 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇక వరుసగా మరో హిట్ దక్కుతుందని ఆశ పడితే అది రివర్స్ అయింది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ. దీంతో తెలుగులో అంతగా అవకాశాలు పొందలేకపోతున్న రాశిఖన్నా ఇప్పుడు తమిళంలో బిగ్ ఆఫర్ ను కొట్టేసింది. హీరో సూర్య సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందే యాక్షన్ ఎంటర్ టైనర్‌లో హీరోయిన్‌గా ఎంపికైంది. సూర్య ప్రస్తుతం ప్రస్తుతం సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన తన 39వ చిత్రాన్ని హరి దర్శకత్వంలో చేయనున్నారు. సూర్య, హరి కాంబినేషన్‌లో ఇంతకుముందు సింగం సిరీస్‌లో అదిరిపోయే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలతోనే వీరి కాంబినేషన్ పట్ల అభిమానుల్లో ప్రత్యేకత నెలకొంది. ఇప్పుడు సూర్య నెక్స్ట్ చిత్రాన్ని హరి డైరెక్ట్ చేయనున్నారని తెలియడంతో తమిళ ప్రేక్షకుల్లోనే కాదు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి మొదలైంది. ఈ సినిమా ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకావాల్సి ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడింది. ‘అరువా’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు  ఇమ్మాన్ సంగీతం అందించనున్నాడు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Raashi Khanna, Suriya, Tamil Film News

    ఉత్తమ కథలు