Home /News /movies /

RAAMAM RAAGHAVAM SONG FROM NTR RAM CHARAN RAJAMOULI RRR RISE OF RAM RELEASED SR

RRR | Rise of Ram : రామమ్ రాఘవమ్.. ఆర్ ఆర్ ఆర్ నుంచి మరో పాట విడుదల..

Rise of Ram Photo : Twitter

Rise of Ram Photo : Twitter

RRR | Rise of Ram : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది. దీంతో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా టీమ్.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఓ రేంజ్‌లో ఉందని అంటున్నారు నెటిజన్స్. కొన్ని సీన్స్ మాత్రం రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు ఈ సనిమాలో పాటల్నీ వరుసగా విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొమురం భీముడో అంటూ ఓ పాటను విడుదలచేసింది. ఆ పాట విడుదల అయ్యి ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

    ఇక ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. ఈ చిత్రం నుండి రైజ్ ఆఫ్ రామ్ పేరిట ఓ పాటను విడుదల చేసింది టీమ్. రామమ్ రాఘవమ్ అంటూ సాగే ఈ పాటను కే. శివ దత్తా రాశారు. విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరణ్‌లు పాడారు. ఈ పాట డిసెంబర్ 31 రాత్రి 9 గంటలకు విడుదల చేసింది టీమ్. లిరిక్స్ మొత్తం సంస్కృతంలో ఉండడంతో పాటు వీడియోను కూడా మంచి విజువల్స్‌తో నింపారు. దీంతో ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ వస్తోంది.


    ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో ప్రిరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా వచ్చి అదరగొట్టారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనుంది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, బాలకృష్ణ గెస్ట్‌‌లుగా రానున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక ఈ చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌కు తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని అంటున్నారు.

    Daksha Nagarkar : చీరలో అదిరే అందాలతో కవ్విస్తోన్న దక్ష.. వైరల్ అవుతోన్న పిక్స్..

    ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: NTR, Ram Charan, RRR, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు