కేబీసీ హోస్ట్‌గా అమితాబ్ చెల్లెలు.. త్వరలో ప్రసారం కానున్న షో..

లాక్ కర్‌దే అంటూ కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌తో అందుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం హిందీలో 11వ సీజన్ నడుస్తోంది. తాజాగా వెండితెరపై అమితాబ్ బచ్చన్ సోదరి కేబీసీ ప్రోగ్రామ్‌కు హోస్ట్ చేయబోతుంది.

news18-telugu
Updated: November 13, 2019, 2:10 PM IST
కేబీసీ హోస్ట్‌గా అమితాబ్ చెల్లెలు.. త్వరలో ప్రసారం కానున్న షో..
అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)
  • Share this:
లాక్ కర్‌దే అంటూ కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌తో అందుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం హిందీలో 11వ సీజన్ నడుస్తోంది. ఒక్కో సీజన్ మినహా అన్ని సీజన్స్‌కు బిగ్‌బీ హోస్ట్‌గా ఈ కార్యక్రమాన్ని నడిపించిన తీరును ఎవరు మరిచిపోలేదు. ఇప్పటికే ఈ షోను వివిధ భాషల్లో కూడా ప్రసారమైంది. తెలుగులో నాగార్జున హోస్ట్‌గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా ప్రసారం అయింది. ఈ సీజన్ హిట్టైయింది. మూడో సీజన్‌కు చిరంజీవి హోస్ట్ చేస్తే.. అంతగా రెస్పాన్స్ రాలేదు. తమిళంలో ‘నీంగలుమ్ వెల్లాలుమ్ ఒరు కోడీ’ పేరుతో ఓ షో ప్రసారం అయింది. మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షోకు సూర్య, ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామి ఒక్కో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా అమితాబ్ బచ్చన్ చెల్లెలు హోస్ట్‌గా కేబీసీ తమిళంలో ప్రసారం కానుంది. అమితాబ్ చెల్లెలు ఏంటి కేబీసీ హెస్ట్ ఏంటి ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారా. ఏమి లేదు.. అప్పట్లో  బిగ్‌బీకి నటించిన ‘ఆజ్ కా అర్జున్’ సినిమాలో రాధిక అమితాబ్  చెల్లెలు పాత్రలో నటించింది.  రీల్ లైప్‌లో చెల్లెలు పాత్రలో నటించిన రాధిక.. రియల్ లైఫ్‌లో అమితాబ్ బచ్చన్ చేసిన ‘కేబీసీ’ ప్రోగ్రామ్‌ను తమిళంలో చేయడానికి రెడీ అవుతోంది.  

రాధిక హోస్ట్‌గా ‘కోడీశ్వరి’ ప్రోగ్రామ్ (Youtube/Photo)


రాధిక విషయానికొస్తే..  తమిళం, తెలుగులో హీరోయిన్‌గా ఎంతో పేరు తెచ్చుకుంది.  తాజాగా ఈమె..స్మాల్ స్క్రీన్ పై కేబీసీ తమిళ  హోస్ట్‌గా సందడి చేయడానికి రెడీ అవుతోంది.పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించి సత్తా చాటిన రాధిక స్మాల్ స్క్రీన్ పై హోస్ట్‌గా లక్ పరీక్షించుకోనుంది. హిందీలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తరహాలో తమిళంలో ‘కోడీశ్వరి’ గేమ్ ప్లాన్ చేశారు. ‘కోడీశ్వరి’ అంటూ కోటీశ్వరి అని అర్ధం. కలర్స్ టీవీ ఛానెల్స్‌లో ప్రసారం కానున్న ఈ షోలో కేవలం మహిళల కోసమే ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసారు. డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ రాధికకు ఒక వీడియో సందేశం పంపారు.ఈ వీడియోలో అమితాబ్ మాట్లాడుతూ.. ఈ సమయంలో మిమ్మల్ని పొగడకుండా ఉండలేం. మీరు తొలిసారి కేబీసీకి మహిళ హోస్ట్ అవుతున్నారు. కేబీసీ చరిత్రలో ఇదో హిస్టరీ అని చెప్పారు. పోటీ పడేవారంత ఇక్కడ మహిళలే కావడం ఇంకో విశేషం. మరోవైపు రాధిక భర్త శరత్ కుమార్ కూడా ఈ ప్రోగ్రామ్ చేయడంపై హర్షం వ్యక్తం చేసారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 13, 2019, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading