Home /News /movies /

RA RA REDDY FROM NITHIIN SRESHTH MOVIES MACHERLA NIYOJAKAVARGAM CLOCKS OVER 500 MILLION VIEWS SR

Nithiin : నితిన్ రారా రెడ్డి పాటకు 500 మిలియన్ వ్యూస్.. ఇది మామూలు క్రేజ్ కాదు..

Macherla Niyojakavargam Ra Ra Reddy song Photo : Twitter

Macherla Niyojakavargam Ra Ra Reddy song Photo : Twitter

Nithiin - Macherla Niyojakavargam : నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదలకానుంది. అది అలా ఉంటే ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన రారా రెడ్డి పాట అరుదైన ఘనతను సాధించింది.

ఇంకా చదవండి ...
    Nithiin | Macherla Niyojakavargam | యువ హీరో నితిన్ పోయిన సంవత్సర మూడు సినిమాలతో పలకరించారు. అయితే అందులో ‘రంగ్ దే’, చెక్’ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఆ తర్వాత విడుదలైన  ‘మాస్ట్రో’ (Maestro) డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam movie). ఈ సినిమాకు ఎడిటర్ ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.  మరో హీరోయిన్‌గా కేథరిన్ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 12, 2022 న థియేటర్లలో భారీగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల గుంటూరులో ట్రైలర్‌ను విడుదల చేసిందీ టీమ్. ట్రైలర్‌ మాత్రం ఓరేంజ్‌లో ఆకట్టుకుంది. మాస్ ఎలిమెంట్స్‌తో వావ్ అనిపించింది. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మాస్ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రారా రెడ్డి అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.

    కాగా ఈ పాటకు సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. మహతి స్వర సాగర్ స్వరపరిచిన రారా రెడ్డి పాట షార్ట్ వీడియో ఫ్లాట్ ఫామ్స్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. అందులో భాగంగా ఈ పాట ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. ఈ షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లన్నింటిలో 500 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించిందని టీమ్ తెలిపింది. ఇక ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి అందించగా మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్ అందించారు. పక్కా మాస్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిట‌ర్‌‌గా చేశారు.


    ఇక ఈ సినిమాను రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కథ విషయానికి వస్తే... దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను నితిన్ ఏ విధంగా చక్కదిద్దాడనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఇక ప్రచారంలో భాగంగా ఇటీవలే మాచర్ల యాక్షన్ ధమ్కీ రిలీజ్ చేశారు. ఈ సాలిడ్ వీడియో నెక్స్ట్ లెవెల్ మాస్ గా ఉందని చెప్పాలి. నితిన్ డైలాగ్ తో మంచి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇందులో కనిపిస్తుంది. ‘ మహాభారతంలో ధర్మాన్ని కాపాడేందుకు లక్షలాది మంది తమ సమాధుల్ని పునాదులుగ వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం.. నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం’ అంటూ సాగే నితిన్ డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి.



    మరోవైపు యూబ్యూబ్‌లో'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్ వీర మాస్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. 20+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట 300K + లైక్స్‌ సొంతం చేసుకొని కేక పెట్టించింది.  నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. నితిన్ తొలి చిత్రం 'జయం' లోని రాను రాను అంటూనే చిన్నదో పాట పల్లవిని ఈ పాటలో చేర్చడం మరింత స్పెషల్ ఎట్రాక్షన్ ని తెచ్చింది. 'రారా రెడ్డి' పాట ప్రస్తుతం ఇంటర్నెట్ సెన్సేషన్ గా దూసుకుపోతుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Krithi shetty, Macherla Niyojakavargam, Nithiin, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు