R Narayana Murthy: చీఫ్ మినిస్టర్స్, సినీ ఇండస్ట్రీకి ఆర్.నారాయణమూర్తి రిక్వెస్ట్.. .పట్టించుకునేవాడెవ్వడు

R Narayana Murthy makes a request to chief ministers and film industry

R Narayana Murthy - Ticket Rates: దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి కోర్టులకు వెళ్లి టిక్కెట్ రేట్స్ పెంచుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఎందుకలా అన్నారో తెలుసా..?

  • Share this:
    ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి... ఈ పేరు గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎలాంటి ఒత్తిడుల‌కు లొంగ‌కుండా, ఎలాంటి మోహాలకు లోను కాకుండా, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌నే చేయాల‌నే ఉద్దేశంతో కాకుండా విప్లవాత్మక సినిమాలను, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కిస్తూ.. దర్శక నిర్మాతగా, నటుడిగా ఓ గుర్తింపును సంపాదించుకున్న వ్య‌క్తి. ఆయ‌న సినిమాలను చూస్తే ఆయ‌న వ్య‌క్తిత్వ‌మేంటో అర్థం చేసుకోవ‌చ్చు. నిర్మొహ‌మాటంగా ఉంటూ విష‌యాల‌పై స్పందించే ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి చాలా సింపుల్‌గా లైఫ్ స్టైల్ గ‌డుపుతుంటారు. కోవిడ్ సమ‌యంలో పెద్ద‌గా బ‌య‌ట‌కు రాకుండా ఇంటిక ప‌రిమిత‌మైన నారాయ‌ణ మూర్తి సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ థాంక్స్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు.

    థియేట‌ర్స్‌కు రావాలా.. వ‌ద్దా? అని ప్రేక్ష‌కులు ఆలోచించుకుంటోన్న స‌మయంలో సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఓ న‌మ్మ‌కాన్ని క‌లిగించింద‌ని ఆయ‌న చిత్ర యూనిట్‌ను ప్ర‌శంసించారు. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, తెలుగు సినీ నిర్మాత‌ల‌కు ఓ రిక్వెస్ట్ కూడా చేశాడు. అదేంటంటే.. ‘‘టిక్కెట్స్ రేట్స్ పెంచ‌కండని. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల చాలా రంగాలు దెబ్బ‌తిన్నాయి. అలాంటి వాటిలో సినీ రంగం కూడా ఉంది. ఈ రంగాన్ని ఆదుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు రాయితీల‌ను ప్ర‌క‌టించారు. ఇదే సంద‌ర్భంలో సినిమా థియేట‌ర్‌కు ప్రేక్ష‌కుడు ఇబ్బంది ప‌డ‌కుండా రావాలంటే టిక్కెట్ ధ‌ర‌లు పెంచ‌కండి. ఎందుకంటే క‌రోనా వ‌ల్ల సినీ రంగ‌మే కాదు.. ప్రేక్ష‌కుడు కూడా బాధితుడే. అలాంటి వాడు థియేట‌ర్‌కు రావాలంటే ఆలోచిస్తున్న త‌రుణంలో కోర్టుల‌కు వెళ్లి టిక్కెట్ రేట్స్ పెంచ‌డం క‌రెక్ట్ కాదు.

    బ‌డ్జెట్ పెరిగిన‌ప్ప‌టికీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టిక్కెట్ రేట్లు పెంచ‌కండి. కోర్టుల‌కు వెళ్లి టిక్కెట్ రేట్లు పెంచుకుంటే బ్లాక్ మార్కెటింగ్‌ను అధికారికంగా ఎంక‌రేజ్ చేసిన వాళ్ల‌మ‌వుతాం. కాబ‌ట్టి ఈ ప్ర‌క్రియ‌కు అటు కోర్టులు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అంగీక‌రించ‌వ‌ద్ద‌ని మ‌న‌వి చేసుకుంటున్నాను’’ అన్నారు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి. అయితే సినీ ప‌రిశ్ర‌మ‌లోని థియేట‌ర్స్ కొంత మంది చేతుల్లో ఉంద‌నేది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. మ‌రి అలాంట‌ప్పుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి రిక్వెస్ట్‌ను ఎవ‌రైనా ప‌ట్టించుకుంటారా? అనేది ఆలోచించాల్సిన విష‌యం.
    Published by:Anil
    First published: