R Narayana Murthy - Suresh Babu: థియేటర్స్ లేకపోతే స్టార్స్ లేరు.. ఓటిటి రిలీజ్‌లు ఆపాలంటూ నారయణ మూర్తి ఫైర్..

ఆర్ నారాయణమూర్తి (r narayana murthy)

R Narayana Murthy - Suresh Babu: ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడే నటులలో నారాయణమూర్తి(R Narayana Murthy) ముందుంటాడు. కేవలం తన సినిమాల విషయంలోనే కాదు.. ఇండస్ట్రీ విషయాలపై కూడా ఈయన స్పందిస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు పీపుల్స్ స్టార్.

  • Share this:
ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడే నటులలో నారాయణమూర్తి ముందుంటాడు. కేవలం తన సినిమాల విషయంలోనే కాదు.. ఇండస్ట్రీ విషయాలపై కూడా ఈయన స్పందిస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు పీపుల్స్ స్టార్. తాజాగా ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఓటిటి రిలీజ్‌లను ఆపాలంటూ విజ్ఞప్తి చేసాడు. ప్రపంచం ముందుకెళ్తుంది.. నాడు నాటకాలు, తోలు బొమ్మలాట నుంచి ఇప్పుడు సినిమాల వరకు వచ్చాం.. ఈ రోజుల్లో సోషల్ మీడియా కూడా బాగా పాకిపోయింది.. యూ ట్యూబ్‌లోనే అన్నీ చూస్తున్నాం.. ఓటిటిలో సినిమాలు చూసేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు నారాయణమూర్తి. అయితే థియేటర్స్‌లో చూడాల్సిన సినిమాను ఇంట్లో కూర్చుని చూడటం థియేటర్స్ వ్యవస్థకే మంచిది కాదంటున్నాడు ఈ హీరో.

టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఒప్పుకోవాల్సిందే కానీ మహానుభావుడు అమర్త్య సేన్ చెప్పినట్లు సాంకేతిక విప్లవం అనేది అట్టడుగు వర్గాలకు చెందని నాడు వేస్ట్ కదా అంటున్నాడు. ఓటిటి కూడా అంతే అంటున్నాడు నారాయణమూర్తి. మొన్న సురేష్ బాబు చెప్పినట్లు నిర్మాతలకు కూడా నష్టాలుంటాయి.. వాళ్ల సినిమాలు ఓటిటిలకు ఇచ్చుకోవచ్చు కానీ నారప్ప సినిమాను కేవలం 25 శాతం మంది మాత్రమే చూసారంటున్నాడు నారాయణమూర్తి. అవును నిజమే.. ఇప్పుడు కరోనా కష్టాలున్నాయి.. జన సమూహాలు ఉండకూడదు.. కరోనా భూతలాన్ని పట్టి పీడిస్తుంది.. కానీ కాలం చాలా గొప్పది.. అన్నీ వాటితోనే సమసిపోతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటున్నాడు నారాయణమూర్తి.
R Narayana Murthy,R Narayana Murthy ott release,R Narayana Murthy suresh babu fire,R Narayana Murthy ott movies,R Narayana Murthy narappa release,R Narayana Murthy fires on ott release,R Narayana Murthy movies,R Narayana Murthy save theatres,ఆర్ నారాయణమూర్తి,ఆర్ నారాయణమూర్తి ఓటిటి రిలీజ్‌లపై ఫైర్,సురేష్ బాబును నిలదీసిన ఆర్ నారాయణమూర్తి
ఆర్ నారాయణమూర్తి (r narayana murthy)

సేవ్ థియేటర్స్ సేవ్ ఫిల్మ్స్ అనే నినాదంతో ముందుకొచ్చాడు ఈయన. ఓటిటి రావడం వల్ల నారప్ప సినిమాను ఇవాళ ప్రపంచ పరంగా కేవలం 25 శాతం మందే చూసారంటున్నాడు. ఓటిటి పేదవాళ్ల దగ్గర లేదని.. మిగిలిన 75 శాతం మంది నారప్ప సినిమాను ఎందుకు చూడకూడదు.. వాళ్లేం తప్పు చేసారంటూ నిలదీసాడు నారాయణమూర్తి. పేదవాళ్లు, బడుగు బలహీన వర్గాలకు నారప్ప చూసే అర్హత లేదా అంటున్నాడు ఈయన. వెంకటేష్ సినిమాను మేం చూడొద్దా అంటూ ప్రశ్నిస్తున్నాడు. అలాంటి అవకాశం అందరికీ వచ్చిననాడు ఓటిటి కరెక్ట్ అని తాను కూడా ఒప్పుకుంటానంటున్నాడు. థియేటర్స్ ఉండాల్సిందే అని.. అది లేకపోతే స్టార్స్ కూడా లేరంటున్నాడు ఈయన.

ఎప్పటికీ థియేటర్స్ ఉంటాయని.. మనిషి ఉన్నంతకాలం థియేటర్స్ ఉంటాయంటున్నాడు నారాయణమూర్తి. థియేటర్స్‌లో సినిమా చూస్తుంటే విజిల్స్ వేస్తాం.. క్లాప్స్ కొడతాం.. జనంతో చూస్తుంటే ఆ ఫీలింగ్ ఇంట్లో కూర్చుని చూస్తే రాదంటున్నాడు ఈయన. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి.. కరోనా కష్టకాలంలో ప్రజలకు వినోదం అందించాలంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో సినిమా థియేటర్స్‌ను తెరిచేలా చూడాలంటున్నాడు నారాయణమూర్తి. పేదవాడి వినోదం సినిమా అనేది గుర్తు పెట్టుకోవాలంటున్నాడు. ఇండస్ట్రీ పెద్దలు కూడా ముందుకొచ్చి ఈ విషయంపై మాట్లాడాలని.. పెద్ద సినిమాలు విడుదల చేస్తే ప్రేక్షకులు చూడ్డానికి ముందుకొస్తారని చెప్తూ సెలవు తీసుకున్నాడు పీపుల్స్ స్టార్.
Published by:Praveen Kumar Vadla
First published: