హోమ్ /వార్తలు /సినిమా /

R Narayana Murthy : ఏపీలో థియేటర్స్ మూసివేతపై జగన్ ప్రభుత్వంపై ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు...

R Narayana Murthy : ఏపీలో థియేటర్స్ మూసివేతపై జగన్ ప్రభుత్వంపై ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు...

R Narayana Murthy Theatres Issue : ఏపీలో థియేటర్స్ మూసివేతపై జగన్ ప్రభుత్వంపై ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.  వివరాల్లోకి వెళితే..

R Narayana Murthy Theatres Issue : ఏపీలో థియేటర్స్ మూసివేతపై జగన్ ప్రభుత్వంపై ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.  వివరాల్లోకి వెళితే..

R Narayana Murthy Theatres Issue : ఏపీలో థియేటర్స్ మూసివేతపై జగన్ ప్రభుత్వంపై ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.  వివరాల్లోకి వెళితే..

  R Narayana Murthy : ఏపీలో థియేటర్స్ మూసివేతపై జగన్ ప్రభుత్వంపై ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.  వివరాల్లోకి వెళితే.. ఏపీలో టిక్కెట్స్ రేట్స్ మరీ తక్కువ ఉన్న కారణంతో కొంత మంది థియేటర్స్ యాజమాన్యలు స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. మరికొన్ని ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఏపీ ప్రభుత్వం వాటిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సక్సెస్ మీట్‌లో ఏపీలో థియేటర్స్ మూసివేతపై ఆవేదన వ్యక్తం చేశారు  పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి. ఉత్తరాంధ్రలో కొన్ని సినిమా టాకీసులు మూసివేతపై వార్తలు చదువుతుంటే.. ఏడుపొస్తోందన్నారు. ఏ సినిమానైనా.. నిర్మించేవారు.. చూపించేవారు.. చూసేవారు బాగుంటేనే చలన చిత్ర పరిశ్రమ చల్లగా ఉంటుందన్నారు.

  సినీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా.. పరోక్షంగా కోట్లాది మంది బతుకుతున్నారు. ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలతో పాటు.. ‘మా’ అధ్యక్షుడిని , సినీ నిర్మాతలు, నటీనటులందరినీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా.. థియేటర్స్ యాజమానులారా.. సినిమా హాళ్లను క్లోజ్ చేయకండి. స్థానికంగా ఉండే మంత్రులను కలవండి. సమస్యను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకెళితే.. సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రభుత్వంతో పాజిటివ్‌గా ఉండండి. ఎవరు నెగిటివ్‌గా ఆలోచించవద్దన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ సీఎం జగన్ గారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.

  Chiranjeevi Dupe: మెగాస్టార్ చిరంజీవికి గత 30 యేళ్లుగా డూప్‌గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా

  ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. థియేటర్స్ పరిస్థితి గురించి నాని ఓ విధంగా మాట్లాడితే.. కొందరు మరొక విధంగా తీసుకున్నారు. ఆ రోజు నాని ఎమోషన్‌తో మాట్లాడారు కానీ.. నెగిటివ్‌గా స్పందించలేదన్నారు. ఆయన్ని ఎవరు తప్పుగా అర్ధం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

  NBK Akhanda Team In Yadadri Temple : యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్న బాలకృష్ణ ‘అఖండ’ టీమ్..

  నాని.. తాను హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఏపీ థియేటర్స్‌లో టికెట్స్ రేటు తగ్గించి ప్రేక్షకులను అవమాన పరిచారనే కామెంట్స్ పై ఏపీ ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయిన సంగతి తెలిసిందే కదా. నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

  విక్రమార్కుడు సీక్వెల్‌కు అంతా రెడీ.. రాజమౌళి కాకుండా ఆ మాస్ దర్శకుడు చేతుల్లోకి ప్రాజెక్ట్..

  3వ రోజు ఏపీ, తెలంగాణలోనే 3.52 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్.. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో దాదాపు రూ. 17 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇంకా చెప్పాలంటే మూడో రోజు బాగానే వసూలు చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను దాటుకుని చాలా మంచి వసూళ్లు తీసుకొచ్చింది శ్యామ్ సింగరాయ్. టాక్ బాగానే ఉండటంతో కచ్చితంగా వీకెండ్ తర్వాత కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు రూ. 22 కోట్ల బిజినెస్ జరిగింది.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, R.Narayana Murthy, Tollywood

  ఉత్తమ కథలు