హోమ్ /వార్తలు /సినిమా /

Jr Ntr: తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్

Jr Ntr: తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్

ఇంటర్ ఎగ్జామ్‌లో ఎన్టీఆర్ పై ప్రశ్న

ఇంటర్ ఎగ్జామ్‌లో ఎన్టీఆర్ పై ప్రశ్న

ఇంటర్ ఎగ్జామ్స్‌ పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఈ పేపర్‌లో జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశ్న రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR)సినిమా కోసం తెలిసిందే. ఈ సినిమా  విడుదలై నెలరోజులకు పైగా అవుతున్నా.. ఆర్ఆర్ఆర్ మ్యానియా మాత్రం తగ్గడం లేదు. నేటికి సినిమా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫెక్ట్ పిల్లలు రాసే పరీక్షల మీద కూడా పడింది. తాజాగా ఓ ఎగ్జామ్ పేపర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌పై విద్యార్థులకు ఓ ప్రశ్న వేశారు.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ (Telangana Intermediate Exams) ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో 'ఆర్ఆర్ఆర్' లోని కొమరంభీం పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) గురించి ప్రశ్న అడిగారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. 'ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరంభీం పాత్రలో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌తో.. మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయండి' అని ప్రశ్నగా ఇచ్చారు.

అయితే ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్‌ను వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గురించి ఎగ్జామ్‌లో క్వశ్చన్ రావడంతో అభిమానులు ప్రశ్నాపత్రాన్ని ట్వీట్ చేస్తూ..వైరల్ చేస్తున్నారు.దటీజ్ పవర్ ఆఫ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటూ.. తారక్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అట్లుంటది తారక్ అన్నతోని అంటు మరికొందరు ఫ్యాన్స్ అంటున్నారు.

ఆర్ఆర్ఆర్‌ సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి వార్తల్లో నిలుస్తూ వచ్చింది. మార్చి 24న ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరి కొద్ది రోజులలో 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా ఇప్పటికే రికార్డుల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా మరో రికార్డు బద్దలు కొట్టింది. ఇప్పటివరకు RRR సినిమా  సిటీలోని సుదర్శన్ 35 mm థియేటర్ లో 5 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

ఆర్ఆర్ఆర్  సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు.  రామ్ చరణ్ సరసన సీత పాత్రలో అలియా భట్ నటించగా..  ఎన్టీఆర్  హీరోయిన్‌గా  జెన్నీ పాత్రలో ఒలీవియా మోరిస్ నటించింది. ఇక ఈ సినిమాలో  అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, మకరంద్ దేశ్పాండే వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

First published:

Tags: Intermediate exams, Jr ntr, Ram Charan, RRR, Telangana intermediate board exams

ఉత్తమ కథలు