Home /News /movies /

PUSPHA ACTOR ALLU ARJUN APPLAUDS KGF 2 AND ITS TEAM A TWEET GOES VIRAL SR

KGF Chapter 2 | Allu Arjun: సినిమా అద్భుతం.. కెజియఫ్ టీమ్‌పై పుష్ప రాజ్ ప్రశంసల జల్లు.. ట్వీట్ వైరల్..

Allu Arjun Photo : Twitter

Allu Arjun Photo : Twitter

KGF Chapter 2 | Allu Arjun: కెజియఫ్ 2 సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు బాహుబలి రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. హిందీలో అత్యంత ఫాస్ట్‌గా 250 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది కెజియఫ్ 2. ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై అల్లు అర్జున్ (Allu Arjun) ప్రశంసించారు. దీనికి సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
  KGF Chapter 2 | Yash : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టమీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు బాహుబలి రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. హిందీలో అత్యంత ఫాస్ట్‌గా 250 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై అల్లు అర్జున్ (Allu Arjun) ప్రశంసించారు. దీనికి సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. సినిమా అదిరిందని.. యశ్ నటన సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు. హీరోయిన్ శ్రీనిధి, ఇతర కీలకపాత్రల్లో మెప్పించిన రవీనా టాండన్, సంజయ్ దత్‌లు తమ మాగ్నాటిక్ ప్రెజెన్స్‌తో వావ్ అనిపించారని.. సినిమాటోగ్రఫీ అందించిన భువన్ గౌడ, సంగీతం ఇచ్చిన రవి బసృర్‌లు తమ పనితనంలో సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్లారని తెలిపారు. ఇక చివరగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తన విజన్‌తో మరో ప్రపంచాన్ని క్రియేట్ చేసి మంత్రముగ్దుల్నీ చేశారని కొనియాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.

  ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. సినిమా తెలుగు రాష్ట్రాలలో.. ఎనిమిదో రోజు 1.5 కోట్ల రేంజ్‌లో షేర్‌ని కలెక్ట్ చేసింది. ఈ సినిమా తెలుగులో 79 కోట్ల బ్రేక్ ఈవెన్ కావాలంటే.. ఇంకా 12.99 కోట్ల రేంజ్‌లో షేర్ రాబట్టాలి. ఇక వరల్డ్ వైడ్‌గా కెజియఫ్ ఎనిమిది రోజుల్లో 750.35 కోట్ల గ్రాస్‌ను సాధించిందని తెలుస్తోంది. ఈ సినిమా బక్సాఫీస్ దగ్గర 345 కోట్ల బిజినెస్ చేయగా.. బ్రేక్ ఈవెన్ పూర్తి అయ్యి 25 కోట్ల రేంజ్‌లో ప్రాఫిట్‌ను సొంతం చేసుకుందని అంటున్నారు. అంతేకాదు రెండో వారం కూడా ఇంతే స్ట్రాంగ్‌గా ఉంటే 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అంటున్నారు. ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెజియఫ్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. మరో సినిమా కూడా రాబోతుందని టాక్. తాజాగా విడుదలైన కెజియఫ్-2 క్లెమాక్స్‌లో పార్ట్‌-3  (KGF Chapter 3) ఉండబోతుందని హింట్‌ ఇచ్చారు దర్శక నిర్మాతలు. మూడో భాగంలో రాఖీ భాయ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో పవర్‌ చూపించనున్నాడట. పార్ట్ 3లో (KGF Chapter 3) రాఖీ భాయ్‌ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించనుందని టాక్. ఇ
  KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటించారు. KGF 2లో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో హిందీ బడా హీరో సంజయ్ దత్‌తో (Sanjay Dutt) అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో (Raveena Tandon) రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు.  క‌న్న‌డ న‌టి శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగండూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Allu Arjun, KGF Chapter 2, Prashanth Neel, Yash

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు