Home /News /movies /

PUSHPA UPDATE TELANGANA GOVERNMENT GIVES PERMISSION TO PUSHPA MOVIE FOR FIVE SHOWS HERE ARE THE DETAILS SR

Telangana | Pushpa : అల్లు అర్జున్‌‌కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

Allu Arjun Photo : Twitter

Allu Arjun Photo : Twitter

Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది.

ఇంకా చదవండి ...
    Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. ఈ నేప‌థ్యంలో పుష్ప మేక‌ర్స్ కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో పుష్ప ఐదో షోకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ నెల 30 వ‌రకు ఐదు షోలు వేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసింది ప్రభుత్వం. దీంతో పుష్ప టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమా రేపు విడుదలకానుండడంతో ప్రమోషన్స్‌‌లో మరింత జోరు పెంచింది పుష్ప టీమ్. అందులో భాగంగా టీమ్ ఈరోజు ముంబైలో ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌తో పాటు పాటలు విడుదలైయ్యాయి. అందులో భాగంగా తాజాగా సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా రిలీజై సోషల్ మీడియాలో అదిరే రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. అంతే కాదు ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ 24 గంటల్లో నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచింది. దీంతో చిత్రబృందం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ పాటలో లిరిక్స్‌తో పాటు పాట పాడిన విధానం, సమంతకు ఉన్న క్రేజ్, దేవిశ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్ పెద్ద ప్లస్ అయ్యాయి.

    ఈ పాట ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఇక మరోవైపు అన్ని హంగులతో రెడీ అయ్యిన ఈ చిత్రం టోటల్ బిజినెస్ ఓ రేంజ్‌లో అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ హక్కులు, ఓటిటి హక్కులు కలిపి దాదాపు 250 కోట్ల‌కు బిజినెస్‌ జరిగిందని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక మరోవైపు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇన్నాళ్లు తన కోసం తన సినిమా కోసం కష్ట పడిన చిత్రబృందానికి అల్లు అర్జున్ డజను మంది ముఖ్య సభ్యులకు ఒక్కొక్కరికి 10 గ్రాముల చొప్పున బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో టీమ్ అల్లు అర్జున్ మనస్సుకు ఫిదా అయ్యారట.


    ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్‌లో అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి ”, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఈ నాల్గవ పాటని నవంబర్ 19న  విడుదల చేశారు. చంద్రబోస్ రాయగా.. నకాష్ ఆజిజ్ పాడారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఖరారు అయ్యారు. తమిళ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం విడుదలకు దగ్గరవ్వడంతో ఈ సినిమాలో నటించే నటీనటుల లుక్స్‌ను విడుదల చేస్తున్నారు. దాక్షాయనిగా అనసూయను పరిచయం చేయగా.. నటుడు సునీల్‌ను మంగలం శ్రీనుగా పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తున్నారు. పుష్పలో రష్మిక పాత్ర చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా‌ లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తికరంగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది.

    ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఆ మధ్య విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న  (Rashmika Mandanna) నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది.

    Priyamani: పూల చీరలో కేక పెట్టించిన అందాల ప్రియమణి... పిక్స్ వైరల్..

    ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో  విడుదలకానుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Allu Arjun, Pushpa Movie, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు