Home /News /movies /

PUSHPA TRAILER MOVIE MAKERS POSTPONE TRAILER FANS ARE MAKING COMMENTING ON TEAM EVK

Pushpa Trailer: షాక్ ఇచ్చిన 'పుష్ప' టీమ్.. కామెంట్ల‌తో రెచ్చిపోతున్న ఫ్యాన్స్‌

పుష్ప సినిమా ట్రైలర్ (pushpa movie trailer)

పుష్ప సినిమా ట్రైలర్ (pushpa movie trailer)

అల్లు అర్జున్ (Allu Arjun)సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో పుష్ప (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 6, 2021న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే అనివార్య కార‌ణాల‌తో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌లేక‌పోతున్నామ‌ని.. మూవీ టీం, మైత్రీ మూవీస్ ఫ్యాన్స్‌కు ట్విట్ట‌ర్ ద్వారా క్ష‌మాప‌ణ చెప్పింది.

ఇంకా చదవండి ...
    అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో పుష్ప (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. అయితే ఈ రోజు పుష్పా ట్రైల‌ర్ రిలీజ్ చేస్తామ‌ని మైత్రీ మూవీస్ తెలిపింది. అయితే అనివార్య కార‌ణాల‌తో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌లేక‌పోతున్నామ‌ని.. ఫ్యాన్స్‌కు ట్విట్ట‌ర్ ద్వారా క్ష‌మాప‌ణ చెప్పింది. మూవీ టీమ్, మైత్రీ మూవీస్. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ అప్‌డేట్ ఇస్తామ‌ని తెలిపారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి ”, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఈ నాల్గవ పాటని నవంబర్ 19న విడుదల చేశారు. చంద్రబోస్ రాయగా.. నకాష్ ఆజిజ్ పాడారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ట్రైలర్‌కు డేట్ ఫిక్స్ అయ్యింది. పుష్ప మూవీ ట్రైలర్‏ను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం.

    ఈ సందర్బంగా పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ ట్రైలర్ కంటే ముందుగా టీజ్ అంటూ ఓ చిన్న టీజర్‌ను వదిలారు.

    Akhanda: యూఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌కృష్ణ "అన్‌స్టాప‌బుల్" క‌లెక్ష‌న్స్‌






    ఈ 26 సెకన్ల నిడివి గల టీజ్‌లో అల్లు అర్జున్‌ ఊరమాస్‌ లుక్‌‌లో అదరగొట్టారు. విజువల్స్ అదిరిపోయాయి. అనసూయ, రష్మికతో పలు పాత్రలను టీజ్‌లో చూపించారు. ఇక పూర్తి ట్రైలర్‌ డిసెంబర్‌ 6న విడుదల చేస్తామ‌ని తెలిపారు. అయితే సాంకేతిక కార‌ణాల‌తో ట్రైల‌ర్ వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది మూవీ టీం.



    కామెట్లు పెడుతున్న ఫ్యాన్స్‌..
    అల్లూ అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఈ ట్రైల‌ర్ వాయిదా వేయ‌డంతో ఫ్యాన్ సోష‌ల్ మీడియాలో కామెట్లు చేస్తున్నారు. త్వ‌ర‌గా రిలీజ్ చేయాల‌ని.. టెక్నిక‌ల్ ఇష్యూ అని చెప్పొద్దంటూ కోరుతున్నారు.

    Pooja Hegde: సన్ టోపీ.. అదిర‌పోయే లుక్స్‌తో.. పూజా హెగ్డే కొత్త పిక్స్


    తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఖరారు అయ్యారు. తమిళ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Allu Arjun, Mythri Movie Makers, Pushpa, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు