అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. అది అలా ఉంటే పుష్ప 1 రష్యాలో (Pushpa In Russia) కూడా విడుదలకానుంది. డిసెంబర్లో అక్కడ విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. ఇక ప్రమోషన్లో భాగంగా తాజాగా రష్యన్ భాషా ట్రైలర్ విడుదలైంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 1న మాస్కోలో & డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్, దర్శకుడు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా అక్కడ డిసెంబర్ 8న విడుదలకానుంది. చూడాలి మరి పుష్పకు ఎలాంటీ రెస్పాన్స్ రానుందో..
ఇక పుష్ప ది రూల్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను టీమ్ రెడీ చేసిందని తెలుస్తోంది. తాజాగా జరిగిన షూట్లో పుష్ప2 కు సంబంధంచిన టీజర్‌ను షూట్ చేశారట. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను థాయ్ లాండ్లో కొనసాగించనున్నారని తెలుస్తోంది.
#PushpaTheRise Russian language trailer out now ????
- https://t.co/yLVTh56rGM Special premieres with team on Dec 1st at Moscow & Dec 3rd at St. Petersburg.#PushpaInRussia from Dec 8th ???? Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @MythriOfficial @4SeasonsCreati1 — Pushpa (@PushpaMovie) November 29, 2022
అక్కడే ఓ 30 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్‌ను ఓ రేంజ్లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట.
ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కేక పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు. హీరోయిన్గా రష్మిక మందన్న కనిపించనుంది.. అయితే ఆమె పాత్రను కాస్తా తగ్గించనున్నారని తెలుస్తోంది. పుష్పతో వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ను ఓ రేంజ్లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు సుకుమార్.. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్‌ను బద్దలు కొట్టనుందో..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Pushpa Movie, Rashmika mandanna, Sukumar, Tollywood news