హోమ్ /వార్తలు /సినిమా /

పుష్పలో సుమ కనకాల నటిస్తోందా.. క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం..

పుష్పలో సుమ కనకాల నటిస్తోందా.. క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం..

యాంకర్ సుమ (suma kanakala)

యాంకర్ సుమ (suma kanakala)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'.

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టైటిల్‌ను ఇటీవలే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ కేక పెట్టిసోంది. రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెకెక్కించబోతున్నారు. దీంతో హిందీ నుండి కూడా ఓ స్టార్ హీరోను ఈ సినిమాలో విలన్‌గా చూపించబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టిని విలన్ పాత్ర కోసం సంప్రదించారట చిత్రబృంతం. తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది. మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. బన్నీకు ఎలాగో నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో హిందీలో తానే డబ్బింగ్ చెప్పుకుంటారని తెలిసింది. అది అలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ యాంకర్ సుమ కీలకరోల్ పోషిస్తుందని వార్తలు వెలువడగా వాటిని కొట్టిపారేసింది చిత్రయూనిట్. సుమ ఈ చిత్రంలో నటిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Anchor suma, Pushpa Movie

    ఉత్తమ కథలు