Allu Arjun - Sukumar: అల్లు అర్జున్‌ 'పుష్ప' షూటింగ్ అప్ డేట్.. సుకుమార్ స్పీడు మామూలుగా లేదుగా..!

Pushpa shooting update delights fans of Allu Arjun and Sukumar

Allu Arjun - Sukumar: 'పుష్ప' సినిమాను తన శైలికి భిన్నంగా చక చకా పూర్తి చేస్తున్నాడు. అందులో భాగంగా రెండు షెడ్యూల్స్‌ చిత్రీకరణను పూర్తి చేసిన యూనిట్‌ సభ్యులు తెలిపారు.

  • Share this:
    స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ మూవీ 'పుష్ప' చిత్రీకరణలో బిజి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. రీసెంట్‌గా ఈ సినిమాను ఆగస్ట్‌ 13న విడుదల చేస్తామని ప్రకటించగానే చాలా మందిలో మొదలైన ప్రశ్న.. సుకుమార్‌ అనుకున్న టైమ్‌లో సినిమాను పూర్తి చేయగలడా? అని అయితే ఈ ప్రశ్నలకు జవాబులు చెబుతూ సుకుమార్‌ చాలా స్పీడును చూపిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన 'పుష్ప' సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటనను వెలువరిచింది. ఏజెన్సీ ప్రాంతాలైన మారేడు మిల్లి, రంపచోడవరంలలో చిత్రీకరించాల్సిన షెడ్యూల్స్‌ను పూర్తి చేశారట. అక్కడున్న గిరిజన ప్రజలు, అధికారుల సహకారంతోనే 'పుష్ప' సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశామని ధన్యవాదాలు తెలిపారు.

    నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానుంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తెన్‌కాశీ, కేరళలో ఈ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న కూడా నటించనుంది. హీరో హీరోయిన్‌ మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు సాంగ్‌ను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశాడట. ఎక్కువ గ్యాప్‌ తీసుకోకుండా సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేస్తే తదుపరి వీఎఫ్‌ఎక్స్‌పై ఫోకస్‌ పెట్టొచ్చు అని బన్నీ, సుకుమార్‌ భావిస్తున్నారట.


    ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా చిత్తూరుజిల్లా యాసను నేర్చుకోవడం విశేషం. బన్నీ ఇందులో పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తాడు. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ ప్యాన్‌ ఇండియామూవీని ఆగస్ట్‌ 13న విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థలై మైత్రీ మూవీ మకర్స్‌, ముత్తం శెట్టి మీడియా ప్రకటించాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే బన్నీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా 'పుష్ప' సినిమాను రూపొందుతుందని సమాచారం. సమాచారం మేరకు 'పుష్ప' సినిమాను రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారట.
    Published by:Anil
    First published: