PUSHPA SAMANTHA ALLU ARJUN SUKUMAR SAMANTHA ITEM SONG IN PUSHPA MOVIE SHAKING YOUTUBE THIS ITEM SONG CROSSES 30 MILLION VIEWS HERE ARE THE DETAILS BK TA
Pushpa - Samantha : ‘పుష్ప’ సినిమా రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. కేవలం ఈ సినిమా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమాలో సమంత యాక్ట్ చేసిన ఐటెం సాంగ్ అయితే యూట్యూబ్ ను ఒక ఊపు ఊపుతుంది. ముఖ్యంగా..
Pushpa - Samantha : ‘పుష్ప’ సినిమా రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. కేవలం ఈ సినిమా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరు మీదా చేస్తున్నారు. నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప సినిమా గురించే చర్చ జరుగుతంది. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత యాక్ట్ చేసిన ఐటెం సాంగ్ అయితే యూట్యూబ్ ను ఒక ఊపు ఊపుతుంది. సినిమా ట్రైలర్ తో ధీటూగా ఈ సాంగ్ అందరి ఆదరణ పొందుతుంది. అంతేకాదు ‘పుష్ప’మూవీలో సమంత సాంగ్ కి వస్తోన్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. సాంగ్ విడుదలైనప్పటి నుంచి ఎటు చూసిన మొత్తం పుష్ప ఐటెం సాంగ్ హావానే నడుస్తోంది. చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఒక ఎత్తైతే...ఈ ఊర మాస్ పాటకు సమంత వేసిన సెప్ట్ లు కుర్రాకారు గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్నాయి.
ఇప్పటికే తన విభిన్నమైన గొంతుతో విశేష ప్రజాదరణ పొందిన సింగర్ మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను పాడిన విధానం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. దీంతోపాటు ఈ సాంగ్ లో సమంత వేసిన స్టెప్పులు పాటకు మరింత హైపు తీసుకొచ్చాయి. సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఈ పాట విడుదల కావడంతో ఈ పాటకు మరింత హైప్ వచ్చిందని అంటున్నాయి సినీ వర్గాలు. ఇదిలా ఉంటే ఈ పాటపై ఇప్పుడు అనుకోని వివాదం చెల రేగింది.
ఈ పాట తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని పురుషుల సంఘం చిత్ర నిర్మాత దర్శకుడిపై కేసుపెట్టింది. పాటలోని సాహిత్యం, విజువల్స్ పురుషులను కామాంధులుగా చూపించే ప్రయత్నం చేసారని వాళ్లు ఆరోపించినట్లు తెలుస్తుంది. అందుకే ఈ పాటపై దావా వేయబడింది. ఈ పాటను వెంటనే నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ కోర్టులో ‘పురుషుల సంఘం’ డిమాండ్ చేయగా.. కోర్టులో ఇంకా కేసు పరిష్కారం కాలేదు.
మరో కొన్ని గంటల్లో ‘పుష్ప’ సినిమా విడుదలకాబోతున్న నేపధ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ పాటకు సమంత వేసిన మాస్ స్టెప్పులు హైలెట్ అంటున్నారు సినీ వర్గాలు. దీంతోపాటు ఈ పాటకు తగినట్టుగా సమంత లుక్ సెట్ కావడం కూడా ఈ పాటకు మరో పెద్ద అడ్వాంటేట్గా మారిందని అంటున్నారు. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్. మంగ్లీ చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ ఇపుడిపుడే గుర్తింపు తెచ్చుకుంటోంది. జార్జిరెడ్డి సినిమాలో జాజి మొగులాలి అనే పాట తోపాటు అలాగే కోటి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన బోల్ బేబి బోల్ రియాల్టీ షోలో పాటలు పాడింది ఇంద్రావతి. (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
(M.Balakrishna, News18, Hyderabad)
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.