హోమ్ /వార్తలు /సినిమా /

Pushpa 2: ఆ విషయం మాకే తెలియదు మీరెలా చెబుతారు? నిర్మాత కామెంట్స్ వైరల్

Pushpa 2: ఆ విషయం మాకే తెలియదు మీరెలా చెబుతారు? నిర్మాత కామెంట్స్ వైరల్

Photo Twitter

Photo Twitter

Pushpa The rule: 'పుష్ప'కు సీక్వెల్‌గా 'పుష్ప: ది రూల్‌' రానున్న నేపథ్యంలో ఈ సినిమా కథపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. తొలిభాగంలో రష్మిక, బన్నీల మధ్య వచ్చే సీన్లు, కెమిస్ట్రీ సినిమాకు బాగా వర్కౌట్ కావడంతో రెండో భాగంలో ఈ ఇద్దరు ఎలా కనిపించబోతున్నారు? సుకుమార్ ప్లాన్స్ ఏంటి అనేవి జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

ఇంకా చదవండి ...

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) క్రేజీ కాంబోలో వచ్చి టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది పుష్ప (Pushpa). ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. కరోనా పరిస్థితుల తర్వాత బాక్సాఫీస్‌ని కళకళలాడించాడు పుష్పరాజ్. ఆయన సరసన నటించిన శ్రీవల్లి (Sri Valli) వావ్ అనిపించింది. ఈ మూవీ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో అల్లు అర్జున్, సుకుమార్ క్రేజ్ కొట్టేశారు. అయితే ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ రెండో భాగం కోసం కసరత్తులు షురూ చేశారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 (Pushpa 2) గురించి పెద్ద ఎత్తున రూమర్స్ బయటకొస్తున్నాయి.

'పుష్ప'కు సీక్వెల్‌గా 'పుష్ప: ది రూల్‌' రానున్న నేపథ్యంలో ఈ సినిమా కథపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. తొలిభాగంలో రష్మిక, బన్నీల మధ్య వచ్చే సీన్లు, కెమిస్ట్రీ సినిమాకు బాగా వర్కౌట్ కావడంతో రెండో భాగంలో ఈ ఇద్దరు ఎలా కనిపించబోతున్నారు? సుకుమార్ ప్లాన్స్ ఏంటి అనేవి జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈ క్రమంలో తొలిభాగంలో శ్రీవల్లిగా కనిపించిన రష్మిక రెండో భాగంలో కూడా అదే రోల్ చేస్తుంది కానీ చివరకు చనిపోతుంది అనే రూమర్ స్ప్రెడ్ అయింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు పుష్ప నిర్మాతల్లో ఒకరైన వై. రవి శంకర్. శ్రీవల్లి పాత్ర సెకండ్ పార్ట్‌లో చనిపోతుందన్న వార్తలను తోసి పుచ్చుతూ అసలు విషయం చెప్పారు. అదంతా చెత్త. నాన్సెన్స్‌.. నిజానికి పుష్ప 2 కథేంటో మాకే సరిగ్గా తెలియదు. అవన్నీ రూమర్స్ మాత్రమే అనేశాడు. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పిన ఆయన.. ఆడియన్స్ ఇలాంటివి పట్టించుకోవద్దని అన్నారు.

కాగా పుష్ప 2 సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఆగస్టులో ప్లాన్ చేశారు మేకర్స్. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనసూయ రోల్ మరింత పవర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ అనసూయ రేంజ్ పెంచేస్తుందని ఇప్పటినుంచే చెప్పుకుంటూ ఉండటం విశేషం. అదేవిధంగా స్పెషల్ సాంగ్ కోసం కూడా సుకుమార్ వేసిన స్కెచ్ ప్రేక్షకులకు యమ కిక్కివ్వనుందట. సో.. చూడాలి మరి పుష్ప 2 ఎలా ఉంటుందనేది!.

First published:

Tags: Allu Arjun, Pushpa, Rashmika mandanna

ఉత్తమ కథలు