Home /News /movies /

PUSHPA OO ANTAVA MAVA OO ANTAVA SINGER INDRAVATHI CHAUHAN NEW FOLK SONG CREATES WONDERS IN YOUTUBE WATCH VIDEO HERE NS

Pushpa Oo Antava Singer: యూట్యూబ్ లో దుమ్మురేపుతోన్న ఊ అంటావా సింగర్ ఇంద్రావతి కొత్త పాట.. స్టెప్పులకు పిచ్చెక్కిపోతోన్న నెటిజన్లు

ఇంద్రావతి (ఫొటో: యూట్యూబ్)

ఇంద్రావతి (ఫొటో: యూట్యూబ్)

పుష్పాలో (Pushpa Movie) ఊ అంటావా మావా.. అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన సింగర్ ఇంద్రావతి (Indravathi Chauhan) కొత్త ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో విడుదలైంది. పాట బాగుండడంతో వ్యూస్ వర్షం కురుస్తోంది. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఆ పాట మీ కోసం..

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం ఇప్పుడు ఫోక్ సింగర్ల హవా నడుస్తోంది. ఇన్నాళ్లు పల్లెల్లో మాత్రమే ఎక్కువగా వినిపించే ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సినిమాల్లో దుమ్ములేపుతున్నాయి. యూ ట్యాబ్ కారణంగా అనేక మంది జానపద గాయకులు వెలుగులోకి వస్తున్నారు. దీంతో వీరికి సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. వీరి పాటలు సనీ ప్రియులను ఉర్రూతలూగిస్తుండడంతో ప్రతీ సినిమాలోను కనీసం ఓ జనపద సింగర్ తో పాడించిన పాట ఉండేలా చూసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇందుకు నిదర్శనమే ఇటీవల విడుదలైన పుష్పా సినిమాలోని (Pushpa Movie) ‘ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ..’పాట. జానపద గాయనిగా పరిచయమై సినిమాల్లోనూ దుమ్ములేపుతోన్న మంగ్లి చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను పాడారు. ఈ పాట విడుదలైన నాటి నుంచి యూ ట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే పది కోట్ల వ్యూస్ ను దాటింది ఈ పాట. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ పాటకు స్టెప్పులు వేయడంతో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. అల్లు అర్జున్ (Allu Arjun) తో కలిసి సమంత(Samantha) వేసిన ఊర మాస్ స్టెప్పులకు థియేటర్లలో ఫాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.

    ఈ పాట పాడిన ఇంద్రావతికి కూడా అభినందలను వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఇప్పటికే అనేక జానపద పాటలు పాడినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఈ పాటతో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ పాట కన్నడ వెర్షన్ ను ఆమె సోదరి మంగ్లి పాడడం విశేషం. ఇలా అక్కా, చెల్లెలు ఇద్దరూ ఈ సినిమా సక్సెస్ లో భాగమై మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇంద్రావతి తాజాగా ఆడిపాడిన మరో పాట యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. గంధసిరి వనమాలి అంటూ సాగే ఈ ఫోక్ సాంగ్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.
    Sukumar: రాజువయ్యా మహ రాజువయ్యా.. ‘పుష్ప’ టీమ్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్..



    వినసొంపైన మ్యూజిక్, కనులకు విందు చేసే డ్యాన్స్, అద్భుతమైన సాహిత్యం కలగలిపిన ఈ పాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో పాటకు వ్యూస్ ల వర్షం కురుస్తోంది. అయితే ఈ పాటకు నిర్మాత ఇంద్రావతి అక్క మంగ్లీనే కావడం విశేషం. చెల్లెను ప్రమోట్ చేయడానికి అక్క మంగ్లీ చేస్తున్న కృషిని సైతం నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇంద్రావతి నువ్వు కూడా మీ అక్కలాగా గొప్ప సింగర్ అవుతావు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ పాటను సదాచంద్ర రచించగా.. మదన్ సంగీతమందించారు. మరో ఫోక్ డ్యాన్సర్ జానూ లిరి ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Allu Arjun, Director sukumar, Pushpa Movie, Rashmika mandanna, Singer Mangli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు