PUSHPA MOVIE RASHMIKA MANDANNA ALLU ARJUN MOVIE SECOND SINGLE RELEASE ON 13 OCTOBER TA 2
Pushpa - Rashmika Mandanna : ‘పుష్ప’ మూవీ నుంచి మరో క్రేజీ అప్టేట్కు టైమ్ ఫిక్స్..
‘పుష్ప’ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ (Twitter/Photo)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబినేషన్లో వస్తోన్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబినేషన్లో వస్తోన్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రష్మిక మందన్న లుక్ విడుదలైంది. పుష్పలో రష్మిక లుక్ చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తి కరంగగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో చీరకట్టులో ఉన్న లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. అక్కడే పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది పుష్ప టీమ్. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అది కూడా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.
She stole our ferocious #PushpaRaj's heart and she is coming to take our breath away 😍
ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా.
ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.